ప్రధాని మోడీ వెళ్లిన ‘అరిచల్ మునాయ్’ ప్రత్యేకత ఏమిటి?
యావత్ దేశం అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం తయారైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Jan 2024 5:56 AM GMTయావత్ దేశం అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం తయారైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గడిచిన కొద్దిరోజులుగా ప్రత్యేక దీక్షను తీసుకోవటం.. పలు అధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లటం.. పవిత్ర జలాలతో స్నానాలు చేయటం దగ్గర నుంచి పలుచోట్ల ప్రత్యేక పూజలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సందర్శిస్తున్న ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా.. ఆదివారం తమిళనాడులోని ఒక ప్రాంతంలో ఆయన జరిపిన పర్యటన నేపథ్యంలో పలువురి చూపు ఆ ప్రాంతం మీద పడింది. అదే.. ‘అరిచల్ మునాయ్’
గడిచిన మూడు రోజులుగా తమిళనాడులోని పలు పర్యాటక ప్రాంతాలు.. అధ్యాత్మిక కేంద్రాల్లో పర్యటిస్టున్న ప్రధాని నరేంద్ర మోడీ.. శ్రీలంకకు కూతవేటు దూరంలో ఉండే అరిచల్ మునాయ్ కు వెళ్లారు. దీని ప్రత్యేకత ఏమంటే.. లంకకు వెళ్లాల్సిన శ్రీరాముడు ఇక్కడి నుంచే రామసేతను నిర్మించినట్లుగా చెబుతారు. రామసేతు ప్రారంభ స్థానంగా దీనికి పేరుంది.
అందుకే.. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా వచ్చిన ప్రధాని మోడీ.. అక్కడి సముద్ర జలాల్ని చేతుల్లోకి తీసుకొని ప్రార్థనలు చేశారు. అంతేకాదు.. అరిచల్ మునాయ్ నుంచి తమిళనాడుకు చెందిన పవిత్ర నదీజలాలతో నిండిన కలశాల్ని వెంట తీసుకెల్లారు. బంగాళాఖాతం.. హిందూ మహాసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ కలిసే ప్రాంతాన్ని తమిళంలో అరిచల్ మునాయ్ గా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ జాతీయ చిహ్నాం ఉన్న స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే శ్రీ కోదండరామస్వామి ఆలయం ఉంది. దీన్ని కూడా ప్రధాని మోడీ సందర్శించి.. స్వామివారికి పూజలు చేపట్టారు.