Begin typing your search above and press return to search.

పిక్ వైరల్... మోడీ వంతు అయ్యింది.. మరి మీ సంగతేమిటి? /

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యలో తాజాగా నేడు మూడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది.

By:  Tupaki Desk   |   7 May 2024 9:00 AM GMT
పిక్ వైరల్... మోడీ వంతు అయ్యింది..  మరి మీ సంగతేమిటి? /
X

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యలో తాజాగా నేడు మూడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ మూడో విడతలో భాగంగా... 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌ సభ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరుగుతోంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే సమయంలో... పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రధాని మోడీ అహ్మదాబాద్‌ లో ఓటేశారు.


అవును... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా... గాంధీనగర్‌ లోక్‌ సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్‌ లో ఓటేశారు. పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్‌ ప్రాంతంలోని నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ కు చేరుకున్నారు. ఆ సమయంలో గాంధీనగర్‌ నుంచి బరిలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రధానితో పాటే ఉన్నారు.

అంతకుముందు మూడో విడతలో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ లో పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు పోలయ్యి కొత్త రికార్డు సృష్టించాలని కోరారు. ఫలితంగా ప్రజలందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్ఠమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా వేలిపై ఉన్న సిరా గుర్తును చూపించారు. దీనికి సంబంధించిన పిక్ వైరల్ గా మారింది!

ఇదే సమయంలో... అహ్మదాబాద్‌ లోని పోలింగ్ బూత్‌ లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆయన సతీమణి సోనాల్‌ షా, కుమారుడు జైషా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా... యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో రితేశ్ దేశ్‌ ముఖ్‌, ఆయన భార్య జెనీలియా, ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ధీరజ్‌ దేశ్‌ ముఖ్‌ లూ ఓటేశారు.