పట్టుదలతో మోడీ.. పంతంతో కాంగ్రెస్.. పార్లమెంటు దద్దరిల్లడం ఖాయం!!
ఒకవైపు పట్టుదల.. మరోవైపు పంతంతో.. ఈ రెండు కూడా ప్రజాస్వామ్యానికి మంచిదికాదు.
By: Tupaki Desk | 18 July 2023 6:28 AM GMTఒకవైపు పట్టుదల.. మరోవైపు పంతంతో.. ఈ రెండు కూడా ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. సామరస్యం.. చర్యలు.. శాంతి యుత వాతావరణం తోనే ఏదైనా సాధ్యమవుతుందని పార్లమెంటు వ్యవహారాలపైనా.. ప్రజా స్వామ్య దేశాల్లో జరుగుతున్న, జరిగిన పరిణామాలపైనా అవగాహన ఉన్నవారు చెబుతారు. కానీ, దేశం లో మాత్రం అన్ని పార్టీలకూ.. ఇప్పుడు మొదటి రెండే ప్రాణ ప్రదం అయిపోయాయి. పట్టుదలతో అధికార పార్టీలు, పంతంతో ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజస్వామ్య దేవాలయాలుగా భావించే చట్టసభలు ఒట్టిపోతున్నాయి.
ప్రస్తుతం ఈ చర్చంతా.. గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలపైనే జరుగుతుండడం గమనార్హం. అధికార బీజేపీ.,. పట్టుదలతో ఉండగా.. కాంగ్రెస్ కూడా అంతే పంతంతో ఉంది. మోడీ నేతృత్వం లోని అధికార పక్షాన్ని తీసుకుంటే.. ఈ పార్లమెంటు సభల్లో ఎట్టి పరిస్థితి లోనూ కీలకమైన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు పచ్చజెండా ఊపించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏం జరిగినా ఫర్వాలేదు.. మేనిఫెస్టోలో పేర్కొన్న ఈ విషయానికి మాత్రం ఓకే అనిపించుకోవాల ని పట్టుదలతో వ్యవహరిస్తోంది.
ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. రెండు కీలక విషయాల పై పంతంతో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకటి కీలకమైన రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం పై వేటు విషయాన్ని పార్లమెంటు లో ప్రస్తా వించడం తద్వారా మోడీ సర్కారు ను ఇరుకున పెట్టాలనేది ప్రధాన వ్యూహంగా ఉంది. అదేసమయం లో ధరల పెరుగుదల ను కూడా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది.
ఎట్టి పరిస్థితి లోనూ టమాటాలు, ఇతర నిత్యావసర వస్తువులు.. అదేవిధంగా గ్యాస్ ధరల ను కూడా పార్లమెంటు వేదిగా చర్చించి.. మోడీ ని ఇరుకున పెట్టే వ్యూహంతో ఉంది. ఇక, మిగిలిన అంశాల్లో ఉమ్మడి పౌరస్మృతి అంశం కూడా ఉంది. మొత్తంగా చూస్తే.. ఒకవైపు పట్టుదల, మరోవైపు పంతం.. ఈ సారి పార్లమెంటు సమావేశాల ను డామినేట్ చేయడం ఖాయమ ని అంటున్నారు పరిశీలకులు.