Begin typing your search above and press return to search.

వాటర్ టైం : విపక్ష ఎంపీకి నీళ్ళిచ్చిన మోడీ!

ప్రధాని నరేంద్ర మోడీ 18వ లోక్ సభ ఆరంభంలోనే అసహనంగా కనిపించారు.

By:  Tupaki Desk   |   3 July 2024 4:01 AM GMT
వాటర్ టైం : విపక్ష ఎంపీకి నీళ్ళిచ్చిన మోడీ!
X

ప్రధాని నరేంద్ర మోడీ 18వ లోక్ సభ ఆరంభంలోనే అసహనంగా కనిపించారు. దానికి కారణం బలమైన విపక్షం. అంతే కాదు మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా విపక్షాల ప్రసంగాలు నిరసనలు సాగడం. రాహుల్ గాంధీ అయితే గంటా నలభై నిముషాలు గుక్క తిప్పుకోకుండా ఇచ్చిన ప్రతిపక్ష నేత స్పీచ్ తో మోడీ ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరకాటంలో పెట్టారు.

ఇక దానికి ధీటుగా మోడీ మంగళవారం సుదీర్ఘమైన తన ప్రసంగంలో బదులిచ్చారు. అయితే విపక్ష నేతలు మాత్రం లోక్ సభలో ఆందోళనలు ఆపడం లేదు. ఏకంగా వారు స్పీకర్ స్థానానికి ఎదురుగా చేరి నిరసనలతో హోరెత్తించారు . వారంతా మోడీ సీటు ఉన్న ముందునే ఆసీనులు కావడం చప్పట్లతో నినాదాలతో సభలో గందరగోళం సృష్టించడం జరిగాయి.

దాంతో ప్రధాని తన ముందున ఆందోళనలు చేస్తున్న విపక్షాలకు వాటర్ తో చిన్న పాటి షాకింగ్ ఇచ్చారు. తన సిబ్బంది ద్వారా నీటిని ఒక గ్లాస్ తో రప్పించిన ప్రధాని దానిని తన ముందు కూర్చుని నినాదాలతో హోరెత్తిస్తున్న విపక్ష ఎంపీ చేతికి అందించారు. దాంతో ఆ విపక్ష ఎంపీ ఒకింత షాక్ తిన్నారు.

ఆ మీదట గ్లాస్ తీసుకోవడానికి నిరాకరించినా ప్రధాని స్థాయి వ్యక్తి ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితులలో తీసుకున్నారు. అయితే ఆయన ఆ గ్లాస్ లోని నీరు తాగారో లేదో తెలియదు కానీ మళ్లీ దాన్ని జాగ్రత్తగా మోడే ఉన్న టేబిల్ వద్దకే చేర్చినట్లుగా సీసీ కెమెరాల ఫుటేజ్ చూపిస్తొంది.

ఏది ఏమైనా సభా పర్వంలో మోడీ తన రాజకీయ చాతుర్యాన్ని చూపించారని నిరసనలు చేస్తున్న ఎంపీల అలసటను గుర్తించి తనదైన శైలిలో సెటైరికల్ గా గ్లాసుతో నీళ్ళు తాగించారని బీజేపీ ఎంపీలు అంటున్నారు. అయితే తాము ప్రజా సమస్యలను సభలో లేవనెత్తి అధికార పక్షం చేతనే నీళ్ళు తాగించామని విపక్ష నేతలు అంటున్నారు ఏది ఏమైనా మొదటి సభలోనే ఆవేశ కావేశాలు నిరసనలు చోటు చేసుకున్నాయి. దాంతో బడ్జెట్ సెషన్ ఎలా ఉంటుందో అన్న చర్చ అయితే సాగుతోంది.