Begin typing your search above and press return to search.

మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీనేనా?

ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉగ్రవాద చర్యలు బాధించాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలు భయపడేవారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 4:30 PM GMT
మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీనేనా?
X

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా పెరుగుతోంది. దేశంలో మోడీ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీతోనే సుస్థిర పాలన సాగుతుందని నమ్ముతున్నారు. అందుకే రెండుసార్లు బీజేపీకి అధికారం కట్టబెట్టారు. మూడోసారి కూడా అధికారం సాధించాలని ప్రయత్నిస్తోంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలు ముందుకు రావడం లేదు. దీంతో మరోమారు బీజేపీనే అధికారం ఖాయమని అంచనా వేస్తున్నారు.

బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలతో దానిపై అందరికి విశ్వాసం ఏర్పడుతోంది. ఇతర దేశాలను నియంత్రించడంలో దాయాది దేశాలను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. పాకిస్తాన్, చైనాలను కట్టడి చేయడంలో తనదైన పాత్ర పోషిస్తోంది. రెండు దేశాలతో మన దేశం పాటిస్తున్న వైఖరితో మన రక్షణపై నమ్మకం పెరిగింది.

ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉగ్రవాద చర్యలు బాధించాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలు భయపడేవారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెర్రరిజాన్ని తుదముట్టించారు. శాంతిభద్రతలే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. దీంతో బీజేపీకి రెండుసార్లు ఇచ్చారు. దీంతో అందుకనుణంగా బీజేపీ కూడా ముందుకు వెళ్తోంది.

ఈనేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మూడోసారి అధికారం ఖాయమనే వాదనలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. ఇలా మోడీ నాయకత్వానికి ప్రజలు జై కొడుతున్నారు.

ఇతర పార్టీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. సుస్థిర పాలన అందించడం ఒక బీజేపీతోనే సాధ్యమని గుర్తించారు. అందుకే మూడోసారి కూడా నరేంద్ర మోడీ నాయకత్వానికే మొగ్గు చూపుతున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ దేశాల నాయకుల్లో కూడా మోడీదే పైచేయిగా ఉంటోంది. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ అప్రతిహ విజయయాత్ర కొనసాగిస్తుందని అంచనాలు తెలియజేస్తున్నాయి. దీంతో బీజేపీ మూడోసారి అధికారం జేజిక్కించుకోవడం కామనే అంటున్నారు.