ఇంతకుమించి అనుకుని.. కష్ణ.. నష్టాల్లోకి ఇంతియాజ్... !
చక్కని అధికారి. చేతిలో బలమైన అధికారం. ఎలాంటి ఆరోపణలు లేని కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.
By: Tupaki Desk | 24 Aug 2024 12:30 PM GMTచక్కని అధికారి. చేతిలో బలమైన అధికారం. ఎలాంటి ఆరోపణలు లేని కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. పలు జిల్లాల్లో అనేక కీలక కార్యక్రమాలు చేసి తనకంటూ ఓ ముద్ర ఉండాలని తపించారు. అయితే.. ఎక్క డో ఆయనకు ఇంతకు మించిన అధికారం కావాలని కోరుకున్నట్టుగా ఉన్నారు. మంత్రిగానో.. ఎమ్మెల్యేగా నో.. చక్రం తిప్పాలని లెక్కలు వేసుకున్నారు. ఈ క్రమంలోనే బలమైన అధికారం ఉన్న.. ఉద్యోగాన్ని క్షణాల్లో వదిలేశారు. కానీ, ఇప్పుడు మాత్రం చేతులు కాలిపోయి.. నానా అగచాట్లు పడుతున్నారు.
ఆయనే.. సీనియర్ మాజీ కలెక్టర్.. మహమ్మద్ ఇంతియాజ్. ఈ ఏడాది ఎన్నికలకు ముందు వరకు ఆయ న సీనియర్ ఐఏఎస్ అధికారి. వక్ఫ్ బోర్డుకు చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఉమ్మడి కృష్నాజిల్లాకు కలెక్టర్‌గా కూడా పనిచేశారు. దీనికి ముందు కూడా ఆయన పలు పదవులు చేసి.. ఎలాంటి ఆరోపణలు లేకుండా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ, ఎన్నికలకు ముందు ఆయనకురాజకీయాల్లోకి రావాలని అనిపించింది. అనుకున్నదే తడవుగా.. లోతుపాతులు చూసుకోకుండానే.. ఐఏఎస్‌కు రాజీనామా చేశారు.
వైసీపీ కండువా కప్పుకొని.. కర్నూలు నుంచి బరిలోకి దిగారు. భారీ ఎత్తున ప్రచారం అయితే.. చేశారు. కానీ, ఆర్థికంగా మాత్రం పెద్దగా బలం లేకపోవడంతో ఆయన ఖర్చు చేయలేకపోయారన్న వాదన ఉంది. ఎలా చూసుకున్నా కూటమి పార్టీల హవా ముందు.. అందరూ తేలిపోయినట్టే ఇంతియాజ్ కూడా తేలిపోయారు. చేసింది తొలిప్రయత్నమే అయినప్పటికీ.. 72 వేల కు పైగా ఓట్లు అయితే రాబట్టుకున్నారు. కానీ.. 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. సరే.. గెలుపు ఓటములు సహజం.
కానీ, ఇప్పుడు పరిస్థితి ఏంటి? వచ్చే ఐదేళ్ల పాటు ఏం చేయాలన్న అంతర్మథనంలో ఇంతియాజ్ కుమి లిపోతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఓటమి తర్వాత.. పార్టీ అధినేతను కలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పటికి రెండు సార్లు అప్పాయింట్‌మెంట్ అడిగినట్టు తెలుస్తోంది. కానీ, జగన్ మాత్రం మౌనంగా ఉన్నారు. అప్పాయింట్‌మెంటు కూడా ఇవ్వలేదు. ఫలితంగా.. ఇంతియాజ్ మానసికంగా బాగా కుంగిపోయినట్టు మైనారిటీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చానని ఆయన భావిస్తున్నారట. కానీ, ఇప్పుడు తిరిగి సర్కారు కొలువుల్లోకి అయితేవెళ్లలేరు కదా! ఏదేమైనా.... క్షణ కాలం చేసిన పొరపాటు.. ఐదేళ్లపాటు ఇబ్బంది పెడుతుండడం గమనార్హం.