తాజ్ మహల్ ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు... భారతీయులకు రిక్వస్ట్!
అవును... ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయుజ్జు.. సతీసమేతంగా తాజ్ మహల్ ను సందర్శించారు.
By: Tupaki Desk | 8 Oct 2024 9:22 AM GMTనాలుగు రోజుల దైపాక్షిక పర్యటన నిమిత్తం భారత పర్యటనకు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయుజ్జు తన సతీమణితో కలిసి తాజ్ మహల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా తాజ్ మహల్ ముందు ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా భారతీయుల ఓ ప్రత్యేక రిక్వస్ట్ చేశారు ముయుజ్జు.
అవును... ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయుజ్జు.. సతీసమేతంగా తాజ్ మహల్ ను సందర్శించారు. ఈ సమయంలో ప్రత్యేక విమానంలో ఆగ్రా చేరుకొన్న వారికి ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేంద్ర ఉధ్యాయ్ స్వగతం పలికారు. ఈ సందర్భంగా ప్రేమకు చిహ్నంగా భావించే పాలరాతి సౌధం తాజ్ మహల్ వద్ద మ్యుయిజ్జు దంపతులు ఫోటొలు దిగారు.
ముయిజ్జు.. సతీసమేతంగా తాజ్ మహల్ ను సందర్శించే సమయంలో ప్రజలకు రెండు గంటల పాటు లోపలికి వెళ్లకుండా అనుమతి ఉండదని ఆగ్రా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది.
కాగా భారత్ కు వచ్చిన ముయిజ్జు సోమవారం ప్రధాని మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలపై సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా స్పందించిన మోడీ.. భారత్ - మాల్దీవుల బంధం శతాబ్ధాల నాటిదని పేర్కొన్నారు. ప్రతీ సంక్షోభంలోనూ ఆ దేశానికి భారత్ ఆపన్న హస్తం అందిస్తుందని గుర్తుచేసారు.
ఈ సందర్భంగా మాల్దీవులకు 40 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో... భారత్ సహకారంతో మాల్దీవుల్లోని హనిమధూ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కొత్తగా నిర్మించిన రన్ వేను ముయిజ్జు, మోడీ సంయిక్తంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ దేశంలో పర్యటించాలని మోడీని కోరారు ముయిజ్జు.
ఈ సందర్భంగా స్పందించిన ముయుజ్జు... తనకు ఆహ్వానం అందించినందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు, తనకు ఘనస్వాగతం పలికినందుకు మోడీకి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో భారతీయులు మాల్దీవులకు మరింత వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు! మాల్దీవుల టూరిజంలో భారతీయుల పాత్ర కీలకమని గుర్తుచేసుకున్నారు.