Begin typing your search above and press return to search.

బంగ్లా ఎంపీని హనీ ట్రాప్ చేసిన మోడల్ ఎవరో తెలుసా?

వైద్య చికిత్స కోసం పశ్చిమ బెంగాల్‌ వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్‌ అన్వర్‌ ఉల్‌ అనర్‌ అత్యంత ఘోరంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   25 May 2024 5:22 AM GMT
బంగ్లా ఎంపీని హనీ ట్రాప్ చేసిన మోడల్ ఎవరో తెలుసా?
X

వైద్య చికిత్స కోసం పశ్చిమ బెంగాల్‌ వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్‌ అన్వర్‌ ఉల్‌ అనర్‌ అత్యంత ఘోరంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు రెండు దేశాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాజాగా ఈ ఎంపీని హనీ ట్రాప్ చేయడంలో కీలక భూమిక పోషించిన మోడల్ ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది.

అవును... కోల్ కతా లో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్ అన్వర్ ఉల్ అనర్ కేసులో హనీ ట్రాప్ ఇష్యూ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఓ మోడల్ తో ఆయనను వలపు వలలోకి లాగి అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు! ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓ అక్రమ వలసదారుడిని కోల్‌ కతా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే!

ఈ సమయంలో ఆ మోడల్ వివరాలు తెరపైకి వచ్చాయి! ఇందులో భాగంగా... బంగ్లా ఎంపీ హత్యలో మోడల్ శిలాస్తి రెహమాన్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. సదరు ఎంపీని అపార్ట్ మెంట్ కు రప్పించేందుకు ఈమెతోనే హనీ ట్రాప్ చేశారని అంటున్నారు. అలా ఎంపీ కోసం ఈ మోడల్ ను ఎరగా వేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు చెబుతున్నారు!

కాగా... బంగ్లా ఎంపీని హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు నిందితులు దారుణంగా ప్రవర్తించారని పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అతని చర్మాన్ని ఒలిచి, శరీరాన్ని ముక్కలుగా నరికి, అవి దుర్వాసన రాకుండా పసుపు కూడా దట్టించి, ఆ ముక్కలను సూట్ కేసుల్లో పెట్టి పలు చెరువుల్లో విసిరేశారని అంటున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఒక కీలక నిందితుడు బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారత్‌ లోకి వచ్చిన జిహాద్‌ హవల్దార్‌ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎంపీని హత్య చేసి ఆయన మృతదేహాన్ని ఛిద్రం చేసినట్లు నిందితుడు హవల్దార్‌ అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు.