Begin typing your search above and press return to search.

యుద్ధం కోసం రాజు సంతకం ఫోర్జరీ.. లక్షన్నర ప్రాణాలు బలిగొన్న యువరాజు

హుతీ రెబల్స్‌ పై యుద్ధ ప్రకటనలో సౌదీ రాజు సల్మాన్‌ సంతకాన్ని యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌) ఫోర్జరీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   19 Aug 2024 1:30 PM GMT
యుద్ధం కోసం రాజు సంతకం ఫోర్జరీ.. లక్షన్నర ప్రాణాలు బలిగొన్న యువరాజు
X

హూతీ రెబెల్స్.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్యలో భాగా వినిపిస్తున్న పేరు ఇది. ఇరాన్.. హమాస్, హెజ్బొల్లా, హూతీలతో కలిసి ఇజ్రాయెల్ పై దాడి చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు హమాస్-ఇజ్రాయెల్ హోరాహోరీ సమరం జరుగుతుండగా హూతీలు ఎర్ర సముద్రంలో అమెరికా సహా అనేక దేశాల వాణిజ్య నౌకలపై దాడులకు దిగారు. అసలింతకూ హూతీలు ఎవరు అంటే..? యెమెన్ ను స్థావరంగా చేసుకున్నవారు. ఇదొక ఉగ్ర సంస్థ. ప్రధానంగా ఎర్ర సముద్రం వీరి అడ్డా అనుకోవాలి. ప్రపంచ సముద్రం వాణిజ్యంలో 12 శాతం దీని ద్వారానే జరుగుతుంది. అందుకే హూతీలు ఎర్ర సముద్రాన్ని కేంద్రంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంటారు. వీరి ధాటికి గత జనవరిలో అమెరికా నాయకత్వంలోని 12 దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. హూతీలు దాడులు ఆపని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

హూతీలపై సౌదీ యుద్ధ భేరి..

యెమెన్ లోని హూతీ తిరుగుబాటుదారులపై గతంలో సౌదీ అరేబియా యుద్ధ ప్రకటన చేసింది. తమకు ముప్పుగా భావించిన హూతీలను ఏరివేయాలని నిర్ణయించింది. అయితే, ఇందుకోసం చేసిన ప్రకటనలో ఓ మలుపుంది. హుతీ రెబల్స్‌ పై యుద్ధ ప్రకటనలో సౌదీ రాజు సల్మాన్‌ సంతకాన్ని యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌) ఫోర్జరీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని వెల్లడించింది కూడా ఆ దేశానికి చెందిన ఇంటెలిజెన్స్‌ అధికారి సాద్‌ అల్‌ జబ్రీ కావడం గమనార్హం. ఈయన ఇంటర్వ్యూను బీబీసీ ప్రచురించింది. కాగా, ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందీ అంటే.. 2015లో కావడం గమనార్హం.

తండ్రి నిస్సహాయ స్థితిలో..

"తండ్రి సల్మాన్ మానసిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఎంబీఎస్ దానిని ఆసరాగా చేసుకున్నారు. యెమెన్ పైకి గ్రౌండ్ ఫోర్స్ (సైన్యం) వెళ్లేందుకు ఆదేశాలిచ్చారు. తండ్రి సంతకాన్ని బీఎస్‌ ఫోర్జరీ చేశారు" అని సాద్ తెలిపారు. కాగా, అల్‌ జబ్రీ అల్‌ఖైదాపై యుద్ధంలో అమెరికాకు విశ్వాసపాత్రుడిగా మెలిగారు. ఆ తర్వాత కెనడాలో ప్రవాసం ఉంటున్నారు. కొన్నేళ్లుగా సౌదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు పిల్లలు కాగా.. వారు రియాద్‌ లో జైల్లో ఉండడం గమనార్హం.

ఎంబీఎస్ ఎంత చెబితే అంత..

సౌదీ అరేబియా.. గల్ఫ్ లో ప్రబల శక్తి. అలాటి దేశానికి ఎంబీఎస్‌ రాజు కాని రాజుగా చెలామణీ అవుతున్నారు. తండ్రి కి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఎంబీఎస్ నేరుగా ప్రపంచ నాయకులతో భేటీ అవుతున్నారు. యెమెన్‌ పై యుద్ధం (దొంగ సంతకం ద్వారా) మొదలుకాగానే.. సౌదీపై ఎంబీఎస్‌ పెత్తనం పెరిగింది.

ఆ యుద్ధం ఓ ఘోర కలి..

యెమెన్‌- సౌదీ అరేబియా యుద్ధం ప్రపంచంలోనే ఓ ఘోర కలిగా చెబుతారు. ఇందులో దాదాపు లక్షన్నర మంది చనిపోవడమే కారణం. అయితే, యెమెన్ ను చాలా తక్కువ అంచనా వేసింది సౌదీ. ఇప్పటి రష్యాలాగే ఉక్రెయిన్ పై రోజుల్లో యుద్ధాన్ని పూర్తి చేస్తాం అనుకుంది. కానీ, ఇది కొన్నేళ్లు కొనసాగింది. అత్యంత మానవీయ సంక్షోభానికి కారణమైంది. కాగా, యెమెన్ పై యుద్ధ సమయంలో ఎంబీఎస్‌ సౌదీ రక్షణ మంత్రి కావడం గమనార్హం. అంటే రక్షణ మంత్రి హోదాలో రాజు సంతకాన్ని ఫోర్జరీ చేసి లక్షన్నర మంది ప్రాణాలు పోయేందుకు కారణమయ్యారన్నమాట.