ఆస్పత్రిలో చేరిన మోహన్ బాబు.. తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు!
కాసేపటికి మనోజ్ బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారని అంటున్నారు. అనంతరం కాసేపటికి మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు రావడం కనిపించింది.
By: Tupaki Desk | 10 Dec 2024 4:58 PM GMTజల్ పల్లిలో మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ అడిషనల్ డీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు జల్ పల్లిలోని నివాసానికి చేరుకోగా.. వారు లోపలికి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం.. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ గేట్లు నెట్టుకుని లోపలికి వెళ్లడం జరిగింది.
కాసేపటికి మనోజ్ బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారని అంటున్నారు. అనంతరం కాసేపటికి మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు రావడం కనిపించింది. మరోపక్క తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి లోనైన మోహన్ బాబు మీడియాపై దాడి చేశారు. మైకులు లాక్కుని హల్ చల్ చేశారు! ఆయన సమక్షంలో అనుచరులు మీడియాపై మరింత రెచ్చిపోయారు.
ఇలా మంగళవారం రాత్రి జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడటం.. తీవ్ర ఘర్షణలు జరిగాని అంటున్న వేళ.. మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు! దీంతో.. ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఇందులో భాగంగా... గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఉన్నారు మోహన్ బాబు.
అవును... మంగళవారం రాత్రి జల్ పల్లిలోని తన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావారణం తో మోహన్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. దీంతో ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ఈ సమయంలో మోహన్ బాబు తో ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు ఉన్నారు.
లైసెన్సు తుపాకులు స్వాధీనం!:
మంచు ఫ్యామిలీలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు చేరడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. ఇందులో భాగంగా... మంచు మోహన్ బాబు, మనోజ్ ల వద్ద ఉన్న లైసెన్స్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. మరోవైపు తాజా పరిణామా నేపథ్యంలో మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మొహరించారు.