Begin typing your search above and press return to search.

ఆవేశంతో ఊగిపోయిన మోహన్ బాబు... మీడియా ప్రతినిధులపై దాడి!

మోహన్ బాబు కుటుంబ తగాదాల వ్యవహారం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Dec 2024 3:35 PM GMT
ఆవేశంతో ఊగిపోయిన మోహన్  బాబు... మీడియా ప్రతినిధులపై దాడి!
X

మోహన్ బాబు కుటుంబ తగాదాల వ్యవహారం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సోమవారం రాత్రి వ్యవహారం పోలీస్ స్టేషన్స్ వద్ద హాట్ టాపిక్ గా మారగా... మంగళవారం వ్యవహారం మొత్తం మోహన్ బాబు నివాసం వద్దకు మారింది. సాయంత్రానికి అక్కడ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తం పరిస్థితులు ఏర్పడ్డాయి.

అవును.. హైదరాబాద్ లోని జల్ పల్లి లోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంచు మనోజ్ దంపతులు ఆ నివాసం నుంచి బయటకు వెళ్లారని అంటున్నారు. అనంతరం అడిషనల్ డీజీపీతో భేటీ అయ్యారని తెలుస్తోంది.

ఆ తర్వత కాసేపటికి తిరిగి ఆ నివాసానికి చేరుకోగా.. గేట్లు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది కాసేపు ఇబ్బంది పెట్టారని అంటున్నారు. దీంతో.. మనోజ్ దంపతులు చాలా సేపు గేటు బయట కారులోనే ఉండిపోవాల్సిన పరిస్థితి అని చెబుతున్నారు. దీంతో.. కారు దిగి సెక్యూరిటీ సిబ్బందితో మనోజ్ వాగ్వాదానికి దిగారని అంటున్నారు!

మరోపక్క.. తన చిన్నపాప కారులోపలే ఉందని మౌనిక ఆందోళన వ్యక్తం చేసిందని అంటున్నారు. దీంతో.. మనోజ్ తన బౌన్సర్లతో గేట్లను బద్దలు కోట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఈ సమయంలో అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... ఈ సమయంలో మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు సమక్షంలోనే బౌన్సర్లు దాడికి దిగారని తెలుస్తోంది. ఈ సమయంలో మీడియా ప్రతినిధులపై కర్రలతో దాడి చేసినట్లు చెబుతున్నారు. దీంతో... మోహన్ బాబు ఇంటి వెలులప ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే నివాసం నుంచి బయటకు వచ్చిన మోహన్ బాబు తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొంతమంది మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేయి చేసుకున్నారని అంటున్నారు.