మోహన్ బాబుని విచారిస్తున్న పోలీసులు!... తెరపైకి తీవ్ర ఉత్కంఠ!
అల్లు అర్జున్ ఎపిసోడ్ ముగిసిన అనంతరం మరోసారి మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 14 Dec 2024 11:36 AM GMTఅల్లు అర్జున్ ఎపిసోడ్ ముగిసిన అనంతరం మరోసారి మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. అది ఈ నెల 19కి వాయిదా పడినట్లు తెలుస్తోంది.
మరోపక్క... మోహన్ బాబుపై నమోదైంది హత్యాయత్నం కేసు కావడంతో ఆయనకు నోటీసులు ఇవ్వకుండా కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో... మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారంటూ వార్తలొచ్చాయి.. వాటిని ఖండిస్తూ.. తాను ఇంట్లోనే ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే... పోలీసులు విచారణకు టాపిక్ ఎత్తినట్లు తెలుస్తోంది!
అవును... హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడటంతో మోహన్ బాబు పరారీలో ఉన్నారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే... తాను ఇంట్లోనే ఉన్నానని.. వైద్య సంరక్షణలో ఉన్నానని ట్వీట్ చేశారు. దీంతో... మోహన్ బాబు పోలీసులకు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో తాను అనారోగ్యంతో ఉన్నానని.. వైద్య సంరక్షణలో ఉన్నానని.. కోరినట్లు తెలుస్తోంది. అయితే... విచారణకు సహకరించాల్సిందే అంటూ పోలీసులు పట్టుబట్టినట్లు చెబుతున్నారు. దీంతో.. ఫైనల్ గా అందుకు మోహన్ బాబు అంగీకరించినట్లు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం మోహన్ బాబును పోలీసులు విచారిస్తున్నారని అంటున్నారు.
మరోపక్క గన్ సరెండర్ విషయంలోనూ పోలీసులు ప్రశ్నించగా.. ఈ రోజు సాయంత్రం సరెండర్ చేస్తానని మోహన్ బాబు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... మోహన్ బాబును పోలీసులు ఏమి ప్రశ్నిస్తున్నారు.. ప్రశ్నించిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొందని అంటున్నారు.
కాగా... మంచు ఫ్యామిలీ రచ్చ వ్యవహారం మంగళవారం రాత్రి పీక్స్ కి చేరినట్లు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో లోపలికి వెళ్లిన మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు రావడం.. ఇదే సమయంలో మీడియాపై మోహన్ బాబు దాడికి పాల్పడటం జరిగింది. దీంతో... మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.