Begin typing your search above and press return to search.

మంచు ఫ్యామిలీ ఎపిసోడ్... మోహన్ బాబు తూచ్ అన్నారా?

అవును... మంచు కుటుంబ వ్యవహారం కాస్తా రచ్చకెక్కిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Dec 2024 6:59 AM GMT
మంచు ఫ్యామిలీ ఎపిసోడ్... మోహన్  బాబు తూచ్  అన్నారా?
X

మంచు ఫ్యామిలీ వివాదం ఇప్పుడు అటు మీడియాలోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం మొదలైన ప్రచారంలో మంగళవారం ఉదయం వరకూ ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలక్కులు అన్నట్లుగా సాగిందని అంటున్నారు. ఈ సమయంలో మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.

అవును... మంచు కుటుంబ వ్యవహారం కాస్తా రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఏ కుటుంబంలో సమస్యలున్నా అది మీడియాకు మీల్స్ కాదు, కాకూడదు కానీ... పోలీస్ స్టేషన్లో ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులు చేసుకున్న అనంతరం అది కచ్చితంగా మీడియా ఫోకస్ పరిధిలోకి వస్తుందని అంటున్నారు.

ఈ సమయంలో మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా... మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం ఉదయం మోహన్ బాబు స్టేట్ మెంట్ రికార్డ్ చేసేందుకు పహాడీ షరీఫ్ పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో మాట్లాడిన మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

ఇందులో భాగంగా... ఏ ఇంట్లో అయినా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని.. అవి అందరి ఇళ్లల్లో ఉంటాయని.. ఇళ్లలో జరిగిన గొడవలు అంతర్గతంగా పరిష్కరించుకుంటారని చెప్పుకొచ్చారని అంటున్నారు. ఇదే సమయంలో.. తమ ఇంట్లో జరుగుతున్నది చిన్న తగాదా అని.. దీన్ని తామే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు చెప్పారని ప్రచారం జరుగుతోంది.

ఇక.. తాను గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను పరిష్కరించి వారి కుటుంబాలు కలిసేలా చేశానని.. ఇప్పుడు తమ ఫ్యామిలీ తగాదా కూడా తామే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు.. పోలీసుల వద్ద అన్నట్లు తెలుస్తోంది.

దీంతో... తాను సీనియర్ సిటిజన్ అని, తన కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన 24 గంటలు గడవకముందే.. ఇది అన్ని ఇళ్లల్లోనూ ఉండే చిన్న తగాదా అని మోహన్ బాబు చెప్పారంటూ వార్తలు వస్తుండటం ఆసక్తిగా మారింది.

మరోపక్క... మోహన్ బాబు నివాసంలో తాజా వివాదంపై చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. జల్ పల్లిలోని నివాసంలో సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు కథనాలొస్తున్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో వివిధ అంశాలపై చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై వీలైనంత త్వరలో క్లారిటీ రావొచ్చని అంటున్నారు.