Begin typing your search above and press return to search.

"పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు!"... డైరెక్టర్ అరెస్ట్!

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Sep 2024 12:54 PM GMT
పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు!... డైరెక్టర్ అరెస్ట్!
X

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఎవరి స్పందనను వారు తెలియజేస్తూ నెట్టింట హాట్ టాపిక్ గా ఉంచుతున్నారు! మరోపక్క ఈ వ్యవహారంపై స్పందించేప్పుడు సినీజనాలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నట్లుగా పవన్ ఇప్పటికే సూచనలు చేశారు.

ఈ విధంగా ఇప్పుడు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ సమయంలో తమిళ చిత్ర దర్సకుడు, స్క్రీన్ రైటర్ మోహన్ జి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో... తిరుచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. అయితే.. ఆయన అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అవును... తమిళచిత్ర దర్శకుడు మోహన్ జీ ఇటీవల ఓ వీడియోలో మాట్లాడుతూ పంచామృతంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి! ఆ వీడియోలో... మగవారిలో నపుంసకత్వానికి దారితీసే మందు పంచామృతంలో కలిసిందని తాను విన్నానని.. ఆ వార్తను దాచిపెట్టి పంచామృతాన్ని ద్వంసం చేశారని.. ప్రూఫ్ లేకుండా మాట్లాడకూడదు కానీ.. అందులో కలిపింది గర్భనిరోధక మాత్రలు అని అక్కడ పనిచేస్తున్నవారు చెప్పారని.. ఇది హిందువులపై జరిగిన దాడని మోహన్ జీ అన్నారని అంటున్నారు.

దీంతో... మంగళవారం ఆయనను చెన్నైలోని రాయపురంలో గల ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అనంతరం ఆయనను తిరుచ్చికి తరలించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన చెన్నైలోని బీజేపీ అధ్యక్షుడు... మోహన్ కు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని అన్నారు.

అతని కుటుంబ సభ్యులకు కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదని.. కారణం ఏమిటి, కేసు ఏమిటి అనే విషయాల గురించి కుటుంబ సభ్యులకు అధికారిక సమాచారం ఇవ్వకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విదుర్ధమని ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇలా మోహన్ అరెస్టును బీజేపీ ఖండించడం ఆసక్తిగా మారింది.

మరోపక్క పళని పంచామృతం గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ధర్మాదాయ శాఖ మంత్రి హెచ్చరించారు.