బ్రేకింగ్: కేటీఆర్ పై ఈడీ ఈసీఐఆర్.. సీరియస్ మేటర్!
ఇందులో భాగంగా.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీ.ఎం.ఎల్.ఏ) ప్రకారం కేటీఆర్, అర్వింద్ కుమార్, బీ.ఎల్.ఎన్. రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది.
By: Tupaki Desk | 20 Dec 2024 1:30 PM GMTతెలంగాణ రాజకీయల్లో తీవ్ర సంచలనంగా మారిన ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహరంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేటీఆర్ ను ఏ1 గా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయగా.. ఆ ఎఫ్.ఐ.ఆర్. ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట (ఈడీ) అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు.
అవును... ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీ.ఎం.ఎల్.ఏ) ప్రకారం కేటీఆర్, అర్వింద్ కుమార్, బీ.ఎల్.ఎన్. రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్.ఐ.ఆర్.ను కోరినట్లు ఈడీ వర్గాలు ధృవీకరించిన తర్వాత ఇది చోటు చేసుకుంది.
మరోపక్క.. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్.ను క్వాష్ చేయాలని శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలూ చేయగా.. దానిపై విచారణ జరిగింది. ఈ సమయంలో.. అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని కేటీఆర్ తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
మరోపక్క ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తైన నేపథ్యంలో... మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని, గవర్నర్ ఆమోదించిన తర్వాతే కేసు నమోదు చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఈ సమయంలో.. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. ఈ నెల 30 వరకూ కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.
ఇదే సమయంలో మరో పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. అదేవిధంగా... కేటీఆర్ పై ఏసీబీ నమోదు ఏసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.
దీంతో... ఈ వ్యవహారంలో కేటీఆర్ చుట్టూ ఉచ్చి బిగుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో... ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సిందే అని.. చట్టం ముందు అంతా సమానమే అని మంత్రులు చెబుతున్నారు!