Begin typing your search above and press return to search.

చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రం... ఆ రెండు దేశాలు కీలక నిర్ణయం!

ఈ క్రమంలో చంద్రుడిపై అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రష్యా, చైనాలు నిర్ణయించుకున్నాయి!

By:  Tupaki Desk   |   7 March 2024 5:28 AM GMT
చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రం... ఆ రెండు దేశాలు కీలక నిర్ణయం!
X

ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య అంతరిక్ష పోటీ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతరిక్షంలో.. ప్రధానంగా చంద్రుడిపై మనిషి శాస్వత నివాసాన్ని సాధించే దిశగా ప్రపంచ దేశాలు తమ దృష్టిని సారించాయి. ఈ విషయంలో ప్రధానంగా అమెరికా, చైనా, రష్యా, జపాన్, ఇండియా మొదలైన దేశాల మధ్య తీవ్ర పోటీ ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే త్వరలో భారత్.. మానవ సహిత అంతరిక్ష యాత్రను ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రుడిపై అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రష్యా, చైనాలు నిర్ణయించుకున్నాయి!

అవును... చంద్రునిపై మనిషి నివాసం ఏర్పాటుచేసుకునే విషయంలో విద్యుత్ అవసరం అత్యంతకీలకమని అంటున్న నేపథ్యంలో... ఈ అవసరాన్ని సోలార్ ప్యానల్స్ తీర్చలేకపోవచ్చని రష్యా, చైనాలు భావిస్తున్నట్లున్నాయి. దీంతో... చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంయుక్త కార్యచరణకు తెరతీస్తూ... అందుకు డెడ్ లైన్ గా 2035ని పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయని రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ యూరీ బోరిసోవ్ తెలిపారు.

ఇదే విషయంపై మరింత స్పందించిన ఆయన... చంద్రుడిపై అణువిద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అంత సులువైన విషయం కాదని అంగీకరిస్తూనే... అణు విద్యుత్ రంగంలో రష్యాకు ఉన్న అపార నైపుణ్యం దీనికి బాగా ఉపయోగపడుతుందని చెపిపారు. ఈ ప్రాజెక్టు చంద్రునిపై మనిషి శాస్వత నివాసానికి దోహదపడే కీలక ముందడుగు అని.. అన్ని రకాలుగానూ బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ప్రాజెక్టును పట్టాలెక్కించినట్లు తెలిపారు. దీనికోసం ప్రధానంగా... రోబోలను రంగంలోకి దించి వాటి సాయంతో పని చేస్తారని తెలిపారు.

ఈ నేపథ్యంలో... చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను అధిగమించే విషయంలో రష్యా, చైనాలు తలమునకలయ్యాయని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ ప్లాంట్ ను ఎప్పటికప్పుడు చల్లబరచడం అనే ప్రక్రియ.. అత్యంత కీలకమైన సవాలుగా మారనుందని చెబుతున్నాయి. వాస్తవానికి గత ఏడాది అంతరిక్ష ప్రయోగం విషయంలో భారీ దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా... రష్యా అత్యంత ప్రష్టాత్మకంగా చేపట్టిన లూనా-25 అంతరిక్ష నౌక స్పేస్ లో అదుపుతప్పి పేలిపోయింది. ఆ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నప్పటికీ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు విషయంలో మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ టార్గెట్ 2035లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటూనే ఈ లోపు చైనాతో కలిసి మానవసహిత చంద్రయాత్ర కు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని తెలుస్తుంది.