హైదరాబాద్ లో కూతురిని చంపిన తల్లి... కారణం దారుణం!!
తన బావను కాకుండా ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని యువతి చెప్పగా తల్లే ఆమెను ఉరేసి హత్య చేసినట్టు తేలిందని తెలుస్తుంది!
By: Tupaki Desk | 21 March 2024 1:25 PM GMTతన కూతురు తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లికి నిరాకరించనే కోపంతో ఒక తల్లి తన ఇంట్లోనే ఆ యువతిని హత్య చేసింది! ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో చోటుచేసుకుంది. తన బావను కాకుండా ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని యువతి చెప్పగా తల్లే ఆమెను ఉరేసి హత్య చేసినట్టు తేలిందని తెలుస్తుంది!
వివరాళ్లోకి వెళ్తే... తన కూతురు తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంలో మోతే జంగమ్మ అనే మహిళ.. 19ఏళ్ల తన కుమార్తె మోతె భార్గవిని హత్య చేసిందని తేలిందని తెలుస్తుంది. ముందుగా ఆమె మరణాన్ని ఆత్మహత్యగా మార్చడానికి ప్రయత్నించినప్పటికీ... పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది!
ఈ విషయాలపై స్పందించిన రాచకొండ పోలీసులు... భార్గవి దిల్ సుఖ్ నగర్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతుందని తెలిపారు! ఈ విషయంలో ఆమె తల్లిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారని తెలుస్తుంది. ఇక భార్గవి తండ్రి ఐలయ్య హమాలీగా పనిచేస్తున్నాడని చెబుతున్నారు.
సోమవారం ఉదయం ఐలయ్య పనికి వెళ్లిన తర్వాత.. జంగమ్మ, ఆమె 17ఏళ్ల కుమారుడు గ్రామంలోని తమ పొలానికి వెళ్లగా.. భార్గవి ఇంట్లోనే ఓంటరిగా ఉందంట. ఈ సమయంలో మద్యాహ్నం 1 గంట ప్రాంతంలో జంగమ్మ ఇంటికి తిరిగి రాగా.. ఆ సమయానికి భార్గవి తన ప్రియుడితో మాట్లాడుతుందని అంటున్నారు. దీంతో... కోపోద్రిక్తురాలైన జంగవ్వను చూసిన ఆ యువకుడు పారిపోయి ఆమె సోదరుడికి సమాచారం ఇచ్చాడట.
దీంతో హుటాహుటిన ఆమె సోదరుడు ఇంటికి పరుగెత్తుకు రాగా.. లోపల నుంచి తలుపు గడియపెట్టి ఉందంట. దీంతో అతడు కిటికీలోంచి చూడగా... అతని తల్లి భార్గవిని కండువాతో గొంతునొక్కి చంపడానికి ప్రయత్నించినట్లు చెప్పాడని తెలిసింది! దీంతో అతడు గట్టిగా తలుపు తట్టడంతో... తలుపు తెరిచిన జంగవ్వ... భార్గవి మెడకు చీర చుట్టుకుని పడిపోయిందని ఏడుస్తూ బయటకు వచ్చిందని తెలుస్తుంది.
ఇలా తన తల్లే తన అక్కను చంపిందని భార్గవి సోదరుడు చెప్పడంతో పోలీసులు గంగవ్వను అదుపులోకి తీసుకున్నారు! అనంతరం నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు!