అచ్యుతాపురం ఘటన... కుమార్తె మృతదేహం పక్కనే పడుకుని తల్లి రోదన!
ఏపీలోని అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
By: Tupaki Desk | 23 Aug 2024 4:50 AM GMTఏపీలోని అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏకంగా 17కి చేరుకుంది! 60 మంది వరకూ ఆస్పత్రుల్లో చికిత్స పోందుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన బాధితుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ.
తాజాగా జరిగిన అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాధంలో చల్లపల్లి హారిక (22) కథ తెలిసిన ప్రతీ ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ఘటనలో ఆమె దురదృష్టం కొద్దీ ప్రాణాలు కోల్పోయింది. వాస్తవానికి... రియాక్టర్ పేలుడు సమీపంలో ఆమె అసలు విధుల్లోనే ఉండాల్సింది కాదని అంటున్నారు.
హారిక ఇటీవల తన పెదనాన్న కొడుకైన సోదరుడికి రాఖీ కట్టేందుకు కాకినాడకు వచ్చింది. ఈ సమయంలో రాఖీ కట్టడం కోసం ఇంటికి వచ్చిన హారికను ఇంకా రెండు రొజులు ఇక్కడే ఉండాలని కుటుంబ సభ్యులు కోరరంట. అయితే ఆమె మాత్రం తనకు సెలవు లేదని.. విధులకు జారవు కావాల్సిందే అని చెప్పి కాకినాడ నుంచి బయలుదేరి అచ్యుతాపురానికి వచ్చేసింది.
ఈ నేపథ్యంలో ఇంకొక్క రోజైనా సెలవు కావాలని ఆ యువతి కోరినా కంపెనీ అధికారులు కుదరదని మొండికేశారని అంటున్నారు. దీంతో... ఇంటి నుంచి తెల్లవారుజామునే బయలుదేరి వెళ్లిన ఆమె విధులకు హాజరయ్యారు. అయితె... ఒక్కసారిగా సంభవించిన విస్ఫోటం ఆమె ప్రాణాలను బలిగొంది.
దీంతో... హారిక కోరినట్లు సెలవు ఇచ్చి ఉంటే ఆమె ప్రాణం నిలిచేదని తల్లి, బంధువులు విలపిస్తున్నారు. ఈ సమయంలో ఆమె మృతదేహాన్ని అచ్యుతాపురం నుంచి కాకినాడకు తీసుకుని వచ్చారు. ఈ క్రమంలో... అనకాపల్లి నుంచి బయలుదేరింది మొదలు హారిక మృతదేహం పక్కనే ఆమె తల్లి అన్నపూర్ణ పడుకుని.. "అమ్మా.. లే అమ్మా.." అంటూ రోదిస్తూ రావడం అందరినీ కలిచివేసింది.
కాగా... భర్త ఈశ్వరరావు ఐదేళ్ల క్రితం చనిపోవడంతో పటు, పదేళ్ల వయసులో కుమారుడు తప్పిపోవడంతో తన ఆశలన్నీ కుమార్తె హారికపైనే పెట్టుకున్నారు అన్నపూర్ణ. ఇక హారిక... ఇడుపులపాయలోని ఐఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎసెన్షియా కంపెనీలో గత సెప్టెంబర్ నుంచి ట్రైనీ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ఇంతలోనే ఇలా జరిగిపోయింది!