Begin typing your search above and press return to search.

రెండు కళ్లూ చాలవు... ఎవరెస్ట్ ని ఇలా ఎప్పుడైనా చూశారా?

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరమైన ఎవరెస్ట్ గురించి, హిమాలయ ప్రాంతంలోని దాని అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By:  Tupaki Desk   |   13 July 2024 10:30 AM GMT
రెండు కళ్లూ చాలవు... ఎవరెస్ట్ ని ఇలా ఎప్పుడైనా చూశారా?
X

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరమైన ఎవరెస్ట్ గురించి, హిమాలయ ప్రాంతంలోని దాని అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతదేశానికి ఉత్తరాన్న ఉన్న ఈ ప్రకృతి వరం అద్భుతం, అత్యద్భుతం. ఇక ప్రపంచంలోనే ఎత్తయిన ఈ శిఖరాన్ని అధిరోహించాలని చాలా మంది అనుకుంటారు.. కొంతమంది సాధిస్తుంటారు.

మరికొంతమంది మాత్రం ఆ వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోలేకో, ఆర్థిక స్తోమత లేకో, మరో కారణంతోనో తమ చిరకాల కోరికను అణిచివేసుకుంటుంటారు. అలాంటివారి కోసం చైనాకి చెందిన డ్రోన్ తయారీ సంస్థ డీజేఈ గ్లోబల్ తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. డ్రోన్ సాయంతో చిత్రీకరించిన ఈ వీడియో అద్భుతంగా ఉంది!

ఈ అద్భుతమైన తాజా వీడియో ఎవరెస్ట్ వద్ద ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సముద్ర మట్టానికి సుమరు 3,500 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ నుంచి ఈ డ్రోన్ ను ప్రయోగించారు. ఎవరెస్ట్ శిఖరం అగ్రభాగం మీదుగా వెళ్తూ.. అక్కడి దృశ్యాలను ఈ డ్రోన్ చిత్రీకరించింది.

ఈ వీడియోలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్న వారు, దిగుతున్న వారూ కూడా కనిపిస్తున్నారు! అంతే కాకుండా శిఖరానికి సంపీపంలో తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లు ఉన్న చుట్టుపక్కల ప్రంతాలు కనివిందు చేస్తున్నాయి. ఇలా ఎవరెస్ట్ శిఖరాన్ని పూర్తిగా చూపించే అరుదైన వీడియో కావడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మీరూ ఓ లుక్కేయండి!!