Begin typing your search above and press return to search.

ఇండియా టుడే సర్వే... తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ ఫలితాలివే!

ఏ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉందన్న సంగతి కాసేపు పక్కనపెడితే... తెలంగాణ ఎంపీ ఫలితాలపై కూడా ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడించింది.

By:  Tupaki Desk   |   8 Feb 2024 11:22 AM GMT
ఇండియా టుడే సర్వే... తెలుగు  రాష్ట్రాల్లో ఎంపీ ఫలితాలివే!
X

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ సర్వేల సందడి నెలకొంది. ప్రధానంగా గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై పలు సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొన్ని గంటల క్రితం టైమ్స్‌ నౌ సర్వే హల్ చల్ చేయగా... తాజాగా ఇండియా టుడే సర్వే ఒకటి తెరపైకి వచ్చింది. ఏ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉందన్న సంగతి కాసేపు పక్కనపెడితే... తెలంగాణ ఎంపీ ఫలితాలపై కూడా ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడించింది.

అవును... ఈసారి కూడా ఎలాగైన గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేంద్రంలో ఎన్డీయే కూటమి వ్యూహాలు రచిస్తుండగా.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో మోడీని ఎలాగైనా గద్దె దింపాలని కాంగ్రెస్ నేతృత్వంలోని "ఇండియా" కూటమి భావిస్తుంది. ఈ సమయంలో అటు ఎన్డీయే కూటమికి, ఇటు ఇండియా కూటమికీ సంబంధం లేని వైసీపీ ఏపిలోనూ, బీఆరెస్స్ తెలంగాణలో ఉండటంతో ఈ ఎంపీ ఫలితాలపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది.

ఈ సమయంలో జాతీయ మీడియా సంస్థ "ఇండియా టుడే" రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీ ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాలు వెల్లడించింది. ఇందులో భాగంగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ 45 శాతం ఓట్లతో 17 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే చెప్పుకొస్తుంది. ఇదే సమయంలో 41శాతం ఓట్ల షేర్ తో అధికార వైసీపీకి 8 ఎంపీ స్థానాల్లో విజయం దక్కే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇక ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ లకు ఒక్క స్థానంలో కూడా విజయం దక్కే అవకాశాలు లేవని తెలిపింది. కాగా.. ఏపీలో టీడీపీ - జనసేన కూటమితో బీజేపీ కూడా జతకట్టబోతుందని, కనీసం 5 - 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే!

ఇక ఈ సర్వే ఫలితాల ప్రకారం తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ (ఇండియా కూటమి) అత్యధికంగా 10 లోక్ సభ స్థానాలు కైవశం చేసుకునే అవకాశం ఉందని చెబుతుండగా.. బీఆరెస్స్ - 3, బీజేపీ - 3, ఎంఐఎం ఒక స్థానంలో గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది.

కాగా... మరో జాతీయ మీడియా టైమ్స్‌ నౌ సైతం తాజాగా ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలోని 25 లోక్‌ సభ స్థానాల్లోనూ 19 ఎంపీ స్థానాలు వైసీపీ దక్కించుకుంటుందని.. తెలుగుదేశం కూటమికి 6 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశముందని టైమ్స్‌ నౌ చెప్పింది. ఈ క్రమంలో దీనికి ఆల్ మోస్ట్ పూర్తి వ్యతిరేకంగా అన్నట్లుగా ఇండియా టుడే సర్వే ఫలితాలు వెల్లడించడం గమనార్హం.