Begin typing your search above and press return to search.

'వీల్ ఛైర్ లో ఉన్నా లాకెళ్లి ఆడిస్తారు'.. ధోని ఇంట్రస్టింగ్ కామెంట్స్!

క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి మొదలైపోయింది. ఈ సందర్భంగా.. ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్మెంట్ అవుతాడనే వార్తలు మరోసారి మొదలైపోయాయి.

By:  Tupaki Desk   |   23 March 2025 6:04 PM IST
వీల్ ఛైర్ లో ఉన్నా లాకెళ్లి ఆడిస్తారు.. ధోని ఇంట్రస్టింగ్ కామెంట్స్!
X

క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి మొదలైపోయింది. ఈ సందర్భంగా.. ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్మెంట్ అవుతాడనే వార్తలు మరోసారి మొదలైపోయాయి. వాస్తవానికి గత సీజన్ లోనూ ఇదే తరహా మాటలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పుకార్లకు చెక్ పెడుతూ తాజా సీజన్ కోసం మహేంద్రసింగ్ ధోనీ సిద్ధమైపోయాడు. అయితే.. మరోసారి ఆ గుసగుసలు మొదలవ్వడం గమనార్హం.

అవును... గత సీజన్ లో మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పై గుసగుసలు బలంగా నడిచిన సంగతి తెలిసిందే. ధోని నడుస్తున్న ఫోటోలు వెనుక నుంచి తీసినవి పోస్ట్ చేసి.. రిటైర్మెంట్ గాసిప్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు! పైగా సీఎస్కే కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికచేయడంతో ఈ గుసగుసలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఈ సమయంలో తాజాగా స్వయంగా రిటరిర్మెంట్ పై ధోనీనే స్పందించాడు.

ఇందులో భాగంగా... తాజాగా ముంబై ఇండియన్స్ మ్యాచ్ నేపథ్యంలో తన రిటైర్మెంట్ పై స్వయంగా మహేంద్రసింగ్ ధోనీనే స్పందించాడు. ఈ సందర్భంగా తన రిటరిఎంట్ పై వస్తున్న వార్తలను కొట్టిపడేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ అనేది తన ఫ్రాంచైజీ అని.. సీఎస్కే తరుపున మరింతకాలం ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఒకవేళ తాను వీల్ ఛైర్ లో ఉన్నాసరే తనను లక్కెళ్లిపోతారని ధోనీ వ్యాఖ్యానించాడు.

కాగా... ఐపీఎల్ లో ధోనీ ఐదు వేలకు పైగా పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఐపీఎల్ లో 264 మ్యాచ్ లు ఆడిన ధోనీ.. 39.13 సగటుతో, 137.54 స్ట్రైక్ రేట్ తో 5,243 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగులు 84 నాటౌట్. ఇదే సమయంలో కీపర్ గా 42 స్టంపౌట్స్ చేసి, 152 క్యాచ్ లు అందుకున్నాడు.