Begin typing your search above and press return to search.

ఆ టైంలో రామ్మోహన్ నాయుడు చేసిన సాయాన్ని మర్చిపోలేం

కేంద్ర పౌర విమానయాన మంత్రిగా వ్యవహరిస్తున్న రామ్మోహన్ నాయుడు పని తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

By:  Tupaki Desk   |   5 Feb 2025 5:13 AM GMT
ఆ టైంలో రామ్మోహన్ నాయుడు చేసిన సాయాన్ని మర్చిపోలేం
X

కేంద్ర పౌర విమానయాన మంత్రిగా వ్యవహరిస్తున్న రామ్మోహన్ నాయుడు పని తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన పని తీరును పలువురు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మానవీయ కోణంలో స్పందిస్త్తున్న తీరు.. అవసరమైన వేళలో చేస్తున్న సాయం గురించి చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఆ జాబితాలోకి చేరారు భారత క్రికెట్ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేరారు. తాజాగా ఒక సందర్భంలో మంత్రి రామ్మోహన్ నాయుడి పని తీరును ప్రత్యేకంగా ప్రస్తావించటమే కాదు.. పొగడ్తలతో ముంచెత్తారు.

గత ఏడాది జూన్ లో కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న రామ్మోహన్ నాయుడు.. ఒక అత్యవసర పరిస్థితిలో చేసిన సాయం అంతా ఇంతా కాదన్నారు. ‘‘నేను ఢిల్లీలో ఉన్నాను. నా మేనల్లుడు అమెరికాలో అకస్మాత్తుగా మరణించాడు. అత్యవసర ప్రయాణానికి మంత్రి ఎంతో సాయం చేశారు. విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకోవటానికి హెల్ప్ చేశారు’’ అని పేర్కొన్నారు.

అంతేకాదు.. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ చెక్ ఇన్ కౌంటర్ మూసేసిన సమయంలోనూ మంత్రి రామ్మోహన్ నాయుడు జోక్యం చేసుకొని తెరిపించిన వైనాన్ని ప్రస్తావించారు. రామ్మోహన్ నాయుడే లేకుంటే.. తాను అమెరికాకు వెళ్లగలిగేవాడిని కాదన్న ఆయన.. ‘‘మూసేసిన చెకిన్ కౌంటర్ ను తెరిపించటంతో ఆ ప్రక్రియను పూర్తి చేసి అమెరికాకు వెళ్లగలిగాను. మంత్రులంతా రామ్మోహన్ నాయుడిలా ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి హోదాలో విమానాల్లో అయ్యప్ప స్వాములు తమ ఇరుముడిలను తీసుకెళ్లటానికి విమాన సంస్థలు అంగీకరించేవి కావు. దీనికి కారణం.. ఆవునెయ్యి టెంకాయల్ని నిబంధనల ప్రకారం అంగీకరించవు. అయ్యప్ప స్వాములు వినతికి స్పందించిన రామ్మోహన్ నాయుడు అయ్యప్ప సీజన్ లో నిబంధనల్ని సడలించి.. వేలాది మంది అయ్యప్పల మనసుల్ని దోచుకున్న సంగతి తెలిసిందే.