తగునా ఇది బాబూ...స్టార్ట్ చేసిన ముద్రగడ
ఇపుడు చూస్తే ఆయన మళ్లీ లేఖలు రాయడం స్టార్ట్ చేశారు. ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వానికి తొలిసారి లేఖాస్త్రం వదిలారు.
By: Tupaki Desk | 15 Nov 2024 8:22 AM GMTఏపీలో లేఖలు రాయడంలో ఎక్స్ పర్ట్ గా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి అనుభవం చాలా ఉంది. ఆయన అధికార పార్టీ మీద అనేక సమస్యల మీద లేఖలు రాసి ఇరుకున పెడుతూంటారు. 2014 నుంచి 2019 దాకా ఆయన అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి వరస లేఖలు రాశారు. అలా డెడ్ లైన్లు కొన్ని సమస్యలు పెట్టి మరీ ప్రత్యక్ష పోరాటానికి దిగిపోయారు.
ఇపుడు చూస్తే ఆయన మళ్లీ లేఖలు రాయడం స్టార్ట్ చేశారు. ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వానికి తొలిసారి లేఖాస్త్రం వదిలారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ బహిరంగ లేఖను ఆయన రాశారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి బాబూ అని అందులో నిలదీశారు.
ఎన్నికలలో ఇచ్చిన అనేక హామీలు పధకాల రూపంలో బడ్జెట్ లో ఎందుకు ప్రవేశపెట్టలేక పోయారు అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలకు అలవి కానీ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారని ఆక్షేపించారు. తీరా ఇపుడు చూస్తే వేటినీ అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారు అంటూ ఇది మీకు తగునా బాబూ అని ప్రశ్నించారు.
కేవలం కబుర్లు చెప్పడంలో మీకు సాటి ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తలచుకుంటేనే భయమేస్తోందని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ కి తెర లేపుతున్నారని అన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ, అలాగే రెడ్ బుక్ పేరుతో కేసులు, ఇపుడు సోషల్ మీడియాలో పోస్టులు అంటూ కేసులు ఇలా చేయడమేంటని ఫైర్ ముద్రగడ ఫైర్ అయ్యారు.
వీటి మీద ఫోకస్ పెట్టడం పక్కన పెట్టి సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు ప్రత్యేక హోదాని ఏపీకి తీసుకుని రావడం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపే ప్రయత్నం చేయడం బాబు అండ్ కూటమి పెద్దలు చేయాలని ఆయన కోరారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకనే ఇవన్నీ మీరు చేస్తున్నారని బాబు మీద విమర్శలు చేశారు. వివిధ కేసులలో అమయాకులను పోలీస్ స్టేషన్ కి పిలిపించి కొట్టించడం ఏమి సబబు అని ఆయన అంటున్నారు.
ప్రజలకు సంబంధించిన అంశాల మీద శ్రద్ధ పెట్టి పాలన చేయాల్సిన చోట ఈ విధంగా చేయడం తగునా అని అన్నారు. మొత్తానికి ముద్రగడ లేఖలు మళ్లీ మొదలెట్టారు అని అంటున్నారు. అది కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన వ్యూహాత్మకంగానే లేఖలు విడుదల చేశారు అని అంటున్నారు. ఇక మీదట కూటమి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ ముద్రగడ మరిన్ని లేఖలు రాసే అవకాశం ఉంది అని అంటున్నారు.
ఏపీలో కూటమి పాలన ఆరవ నెలలోకి ప్రవేశించింది, ఇప్పటిదాకా మౌనంగా ఉన్న ముద్రగడ రాజకీయంగా విరామం ప్రకటించారని అంతా అనుకున్నారు. అయితే ఆయన కూటమి ముందు పలు డిమాండ్లు పెడుతూ లేఖలు రాస్తున్నారు. అందులో సూపర్ సిక్స్ హామీలు కానీ స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ వీటన్నిటికీ మించి ప్రత్యేక హోదా కానీ సాకారం చేయడం టఫ్ టాస్క్ అని అంటున్నారు. సో ముద్రగడ మరిన్ని లేఖలకు అంతా వెయిట్ చేయవచ్చు అని అంటున్నారు. మరి ముద్రగడ లేఖల మీద కూటమి ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.