దారుణం: ముద్రగడ నోట వినలేని మాట!
''నువ్వు స్వచ్ఛమైన కాపుకులానికి చెందిన వాడివైతే.. నీతల్లి, తండ్రి చరిత్రను బయట పెట్టు'' అని ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 8 May 2024 2:45 PM GMTరాజకీయాల్లో అంతో ఇంతో నిబద్ధత.. పరిపక్వత.. నేటి తరానికి భిన్నంగా ఉంటారని ఆశించిన కాపు ఉద్యమ నాయకుడు ముద్ర గడ పద్మనాభం పూర్తిగా రాంగ్ ట్రాక్‌లోకి వెళ్లిపోయారు. నోటి నుంచి సభ్యసమాజం వినలేని మాటలు అనేశారు. అది కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి కావడం గమనార్హం. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు తీవ్రస్థాయిలో మంటలు రేపే ప్రమాదం ఏర్పడింది. ''నువ్వు స్వచ్ఛమైన కాపుకులానికి చెందిన వాడివైతే.. నీతల్లి, తండ్రి చరిత్రను బయట పెట్టు'' అని ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు.
''మా తాతగారు కాపులు, మా నాయనమ్మ కాపులు, మా అమ్మ, మానాన్న, నేను, నా భార్య, నాకోడలు, నా కొడుకు స్వచ్ఛమైన కాపులం. అంతేకాదు, నిఖార్సయిన కాపులం. మరి మీ సంగతేంటి? మీరు స్వచ్ఛమైన కాపులైతే.. మీ చరిత్ర కూడా బయట పెట్టండి. మీ అమ్మ, మీ నాన్నగారి చరిత్ర, మీరు పుట్టిన ప్రాంతం, మీతాత, మీ నాయనమ్మ, మీ అమ్మ పుట్టిపెరిగిన ఊరు అన్నీ ప్రజలకు వివరంచండి. ఎవరు నిఖార్సయిన కాపులో ప్రజలు తెలియాలి'' అని ముద్రగడ రెచ్చిపోయారు. ఎవరు కాపో.. ఎవరు కల్తీ కాపో తేలిపోవాలి.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నీ భార్యలకు టికెట్ ఇప్పిస్తా ''మా అమ్మాయికి టికెట్ ఇస్తానని అంటున్నారు పవన్ కల్యాణ్ గారూ.. మీరు మీ భార్యలను తీసుకువస్తే.. సీఎం జగన్‌గారితో మాట్లాడి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తా. మీ ఇద్దరు మాజీ భార్యలకు, ప్రస్తుత భార్యకు కూడా వచ్చే ఎన్నికల్లో జగన్‌గారితో మాట్లాడి టికెట్లు ఇప్పిస్తానని చెబుతున్నా'' అని ముద్రగడ వ్యాఖ్యానించారు. వంగా గీత కాపు కులస్తురాలు కాబట్టే.. తాను ఆమెకు మద్దతు ఇస్తున్నానని ముద్రగడ చెప్పారు. సినిమాల్లో చేసే డాన్సులు, యాక్షన్‌లు ఇక్కడ చేయొద్దని ముద్రగడ చెప్పారు.