భారత్ లో పెరిగిన కుబేరులు.. ఆ టాప్-10లో ముకేష్ మిస్ ఎందుకు?
వాస్తవానికి గతంలో ఓ జాబితాలో ఉన్న 27 మంది సంపద కోల్పోయినా.. కుబేరుల సంఖ్య మాత్రం మొత్తంగా పెరిగింది. వీరి చేతిలో ఉన్న సంపద విలువ రూ.98 లక్షల కోట్లు.
By: Tupaki Desk | 27 March 2025 2:30 PMగతఏడాదితో పోలిస్తే బిలియనీర్ల సంఖ్య మరో 45కు పెరిగి 284కు చేరింది.. తాజాగా వెలుగులోకి వచ్చిన "హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ - 2025" జాబితాలోఈ విషయం వెల్లడైంది. వాస్తవానికి గతంలో ఓ జాబితాలో ఉన్న 27 మంది సంపద కోల్పోయినా.. కుబేరుల సంఖ్య మాత్రం మొత్తంగా పెరిగింది. వీరి చేతిలో ఉన్న సంపద విలువ రూ.98 లక్షల కోట్లు.
అవును.. తాజాగా హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 తెరపైకి వచ్చింది. ఇందులో.. వరల్డ్ జాబితాలో ఎలాన్ మస్క్ సంపద 82 శాతం పెరిగి, 420 బిలియన్ డాలర్లకు చేరడంతో.. ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. అనంతరం.. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ 266 బిలియన్ డాలర్లతో రెందోస్థానంలో.. మార్క్ జుకర్ బర్గ్ (242 బిలియన్ డాలర్లు) మూడోస్థానంలో నిలిచారు.
అనంతరం ఒరాకిల్ సీఈవో లారీ ఎల్లిసన్, పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్, గూగుల్ కో ఫౌండర్ లారీ పేజ్ ఉన్నారు. ఇదే సమయంలో... ఈ జాబితాలో హెచ్.సీ.ఎల్. అధినేత శివ్ నాడార్ కుమార్తె రోషి రూ.3.5 లక్షల కోట్ల సంపదతో ప్రపంచ సంపన్న మహిళల టాప్ టెన్ లోకి ప్రవేశించారు. ఈ జాబితాలో ఆమె ఐదో స్థానంలో ఉన్నారు.
అయితే... ఈ జాబితాలో వరల్ద్ టాప్ 10లో ముకేష్ అంబానీ స్థానం కోల్పోయారు. గత ఏడాదిలో అప్పులు పెరగడం వల్ల ఆయన సంపద రూ.లక్ష కోట్ల వరకూ క్షీణించినట్లు చెబుతున్నారు. ఫలితంగా.. వరల్ద్ రిచ్చెస్ట్ పర్సన్స్ జాబితాలో టాప్ 10 లో లేకపోయినా.. ఆసియాలో మాత్రం అత్యంత సప్పనుడి హోదాను కంటిన్యూ చేస్తున్నారు.
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 టాప్-10లో ముఖేశ్ అంబానీ స్థానం కోల్పోయారు. గత ఏడాదిలో అప్పులు పెరగడంతో ఆయన సంపద రూ.లక్ష కోట్లు క్షీణించినట్లు దీనిలో పేర్కొన్నారు. నష్టాలు ఉన్నా.. ఆసియాలో అత్యంత సంపన్నుడి హోదాను మాత్రం ఆయన నిలబెట్టుకొన్నారు. ఇదే సమయంలో.. భారత్ జాబితాలోనూ ముకేష్ అంబానీ ఫ్యామిలీ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంది.
ఈ సందర్భంగా... ముకేష్ అంబానీ ఫ్యామిలీ సంపద రూ.8.6 లక్షల కోట్లుగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఉన్నవారి జాబితా ఈ విధంగా ఉంది.
గౌతమ్ అదానీ కుటుంబం - రూ.8.4 లక్షల కోట్లు
రోష్ని నాడార్ కుటుంబం - రూ.3.5 లక్షల కోట్లు
దిలీప్ సింఘ్వీ కుటుంబం - రూ.2.5 లక్షల కోట్లు
అజీమ్ ప్రేమ్ జీ కుటుంబం - రూ.2.2 లక్షల కోట్లు
కుమార మంగళం బిర్లా కుటుంబం - రూ.2.0 లక్షల కోట్లు
సైరస్ పూనావాలా కుటుంబం - రూ.2.0 లక్షల కోట్లు
నీరజ్ బజాజ్ కుటుంబం - రూ.1.6 లక్షల కోట్లు
రవి జైపురియా కుటుంబం - రూ.1.4 లక్షల కోట్లు
రాధా కిషన్ దమానీ కుటుంబం - రూ.1.4 లక్షల కోట్లు