Begin typing your search above and press return to search.

అంబానీ కొత్త జెట్.. విమానం కాదు కదిలే ఇంద్రభవనం

ఈ కొత్త జెట్ బోయింగ్ మ్యాక్స్ 8 కంటే పెద్ద కేబిన్.. కార్గో స్థలాన్ని కలిగి ఉంటుందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   22 Sep 2024 8:30 AM GMT
అంబానీ కొత్త జెట్.. విమానం కాదు కదిలే ఇంద్రభవనం
X

రోటీన్ కు భిన్నంగా చేయటం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి అలవాటు. గ్రాండియర్ ను ఇష్టపడే ఆయన.. తాను ఇష్టంగా చేసే పనిని భారీగా చేస్తుంటారు. తరచూ వార్తల్లో ఉండే ఆయన.. తాజాగా కొత్త ప్రైవేట్ జెట్ ను కొనుగోలు ద్వారా వార్తల్లో వ్యక్తిగా మారారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి ఒక ఖరీదైన అలవాటు ఉంది. ఆయన ప్రైవేట్ జెట్ కలెక్షన్ అంటే మక్కువ. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఆయనకున్న తొమ్మిది ప్రైవేట్ జెట్ క్లబ్ లో పదోది వచ్చి చేరింది. కదిలే ఇంద్రభవనంలా అభివర్ణిస్తున్న ఈ కొత్త జెట్ విశేషాల పుట్టగా చెబుతున్నారు.

తాజాగా కొనుగోలు చేసిన ఈ ప్రైవేట్ జెట్ బోయింగ్ 737 మ్యాక్స్ 9గా చెబుతున్నారు. దీని విలువ దగ్గర దగ్గర రూవెయ్యి కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు. విమానాన్నికొనుగోలు చేసిన తర్వాత మార్పులు చేర్పులతో కలిసి ఈ ధరకు కాస్త ఎక్కుగానే ఉంటుదని చెబుతున్నారు. ఈ అల్ట్రా లాంగ్ రేంజ్ బిజినెస్ జెట్ కోసం అంబానీ కుటుంబం భారీగా ఖర్చు చేయటానికి వెనుకాడలేదు. ఈ కొత్త విమానం పదోది కాగా.. ఇప్పటికే ఉన్న తొమ్మిది విమానాలు.. హెలికాఫ్టర్ల లెక్కలోకి వెళితే..

- ఒక ఎయిర్‌బస్‌ A319 ACJ(దీన్ని 18ఏళ్లుగా సర్వీస్ లో ఉంది)

- రెండు బొంబార్డియర్ గ్లోబల్ 5000 జెట్‌లు

- ఒక బొంబార్డియర్ గ్లోబల్ 6000 జెట్

- ఒక డస్సాల్ట్ ఫాల్కన్ 900S

- ఒక యఎంబ్రేర్ ERJ 135

- డౌఫిన్ హెలికాప్టర్

- సికోర్స్కీ S76 లగ్జరీ హెలికాప్టర్

హెలికాఫ్టర్లను తక్కువ దూర ప్రయాణాల కోసం వినియోగిస్తుంటారు. తాజాగా కొన్న కొత్త ప్రైవేట్ జెట్ లో నాన్ స్టాప్ గా వేలాది కిలోమీటర్లు ప్రయాణించే వీలుంది. ఈ కొత్త జెట్ బోయింగ్ మ్యాక్స్ 8 కంటే పెద్ద కేబిన్.. కార్గో స్థలాన్ని కలిగి ఉంటుందని చెబుతున్నారు.

ఈ మధ్యన తన చిన్న కొడుకు పెళ్లిని ప్రపంచంలోనే ఖరీదైన పెళ్లిళ్లలో ఒకటిగా చేసిన ఆయన.. అందుకోసం వందల కోట్ల రూపాయిల్ని నీళ్ల మాదిరి ఖర్చు చేశారు. 2023 ఏప్రిల్ 13 నుంచి ఈ ఆగస్టు 27 వరకు అన్ని పరీక్షల్ని నిర్వహించారు. ఈ విలాసవంతమైన విమానానికి అవసరమైన అన్ని ప్లయింగ్ పరీక్షలు పూర్తి అయ్యాయి. క్యాబిన్ తో సహా అన్ని రకాల ఇంటీరియర్ ను అప్ గ్రేడ్ చేశారు. పలు మార్పులు చేపట్టారు.

తాను కొనుగోలు చేసిన ఈ ప్రైవేట్ జెట్ ను స్విట్జర్లాండ్ లోని యూరో ఏర్ పోర్ట్ బేసెల్ - ముల్ హౌస్ ఫ్రీబర్గ్ లో రీమోడలింగ్ చేపట్టారు. స్విస్ లో ఉన్న ఈ విమానాన్ని బేసెల్.. జెనీవా.. లండన్.. లుటన్ విమానాశ్రయాల్లోనూ పరీక్షలు చేపట్టారు. అన్నీ పనులు పూర్తి చేసి.. దీని సామర్థ్యానికి అవసరమైన అన్ని తరహా పరీక్షలు పూర్తి అయ్యాక మాత్రమే దీన్ని భారత్ లోకి తీసుకొచ్చారు. బేసెల్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఈ విమానం 9 గంటల వ్యవధిలో 6234కిలోమీటర్లు ప్రయాణించినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ కొత్త విమానాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులోని కార్గో టెర్మినల్ సమీపంలో ఉన్న మొయింటెన్స్ టెర్మినల్ లో ఉంచారు. త్వరలో ముంబయిలోని రిలయన్స్ హెడ్ క్వార్టర్స్ కు దీన్ని తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకూ ఈ కొత్త ప్రైవేట్ జెట్ విశేషాలు ఏమిటన్న దాన్లోకి వెళితే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్ లలో దీన్నొకటిగా చెబుతున్నారు. ఇది రెండు సీఎఫ్ఎంఐ లీప్ 18 ఇంజిన్ తో పని చేస్తుంది. ఈ విమానం నెంబరును 8401 ఎంఎస్ఎన్ గా నిర్ధారించారు. 11,770కిలోమీటర్లు నాన్ స్టాప్ గా ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం.