Begin typing your search above and press return to search.

అంబానీ డీప్‌ ఫేక్‌ వీడియో... ఆ డాక్టర్ పరిస్థితి ఇదే!

వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని అంథేరీకి చెందిన డాక్టర్ పాటిల్ కు ఇన్ స్టాగ్రాం లో ఒక వీడియో దర్శనమిచ్చింది.

By:  Tupaki Desk   |   21 Jun 2024 11:30 PM GMT
అంబానీ డీప్‌  ఫేక్‌  వీడియో... ఆ డాక్టర్  పరిస్థితి ఇదే!
X

ఇటీవల డీప్ ఫేక్ వీడియోల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందని అంటున్నారు. ప్రధానంగా సినిమా హీరోయిన్లు, సెలబ్రెటీలూ వీటి బారిన పడుతున్నారు. అయితే... కాస్త రోటీన్ కి భిన్నంగా అన్నట్లుగా డీప్ ఫేక్ వీడియో వల్ల ఒక డాక్టర్ కేటుగాళ్ల వలకు చిక్కిన సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... ఇటీవల కాలంలో డీప్ ఫేక్ వీడియోలతో అమాయకులను బుట్టలో వేసుకోవడం అనే విషయాలు విరివిగా జరుగుతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా భారత ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ డీప్ ఫేక్ కారణంగా ఓ వైద్యుడు మోసపోయిన ఘటన తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని అంథేరీకి చెందిన డాక్టర్ పాటిల్ కు ఇన్ స్టాగ్రాం లో ఒక వీడియో దర్శనమిచ్చింది. ఇందులో భాగంగా... రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్, దానికి సంబంధించిన బీ.ఎస్.ఎఫ్. ఇన్వెస్ట్ మెంట్ అకాడమీలో పెట్టుబడులు పెడితే భారీ రిటర్న్స్ వస్తాయని ఆ వీడియోలో కనిపించింది.

దీంతో ఆ వీడియోలో కనిపించిన సంస్థ వివరాలను ఆన్ లైన్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు డాక్టర్. ఆ సమయంలో.. సదరు సంస్థ కార్యాలయాలు ముంబై, లండన్ లలో ఉన్నట్లు ఆయనకు కనిపించిందంట. పైగా ఆ సంస్థ గురించి స్వయంగా ముకేష్ అంబానీయే ప్రచారం చేసినట్లుగా ఉండి. దీంతో డాక్టర్ ఆ వీడియోను నమ్మారు.. ఫలితంగా కేటుగాళ్ల చేతికి చిక్కారు!

ఈ నేపథ్యంలో వివరాలన్నీ పక్కాగా ఉన్నాయి.. పైగా ముకేష్ అంబానీ ప్రచారం చేసినట్లు నమ్మిన డాక్టర్ పాటిల్... సుమారు ఏడు లక్షల రూపాయలను సుమారు 16 బ్యాంక్ అకౌంట్లకు పంపించారు. అయితే తొలుత... చెప్పినట్లుగానే ట్రెడింగ్ వెబ్ సైట్ లో భారీ లాభాలు కనిపించాయి.

దీంతో.. ఆ డబ్బును విత్ డ్రా చేసుకుందామని ప్రయత్నించిన డాక్టర్ కు షాక్ తగిలింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. అప్పుడే మోసగాళ్లు డీప్ ఫేక్ టెక్నాలజీని వాడారని బయటపడింది. ఇదే సమయంలో... అక్రమ లావాదేవీలను బ్లాక్ చేసేలా పోలీసులు బ్యాంకులకు ఆదేశాలు జారీచేశారు.