పోలింగ్, రీపోలింగ్ పై సీఈవో ఎంకే మీనా కీలక వ్యాఖ్యలు!
అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పై ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని కొన్ని చోట్ల రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ కొనసాగినట్లు తెలిపారు.
By: Tupaki Desk | 14 May 2024 9:34 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా 80శాతానికి పైగా పోలింగ్ నమోదైందని చెబుతున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 2 గంటల వరకూ కొన్ని బూత్ లలో పోలింగ్ జరిగినట్లు చెబుతున్నారు. సోమవారం రాత్రి 12 గంటల వరకు దాదాపు 78.25శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఇదే సమయంలో రీపోలింగ్ పైనా స్పష్టత ఇచ్చారు.
అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పై ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని కొన్ని చోట్ల రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ కొనసాగినట్లు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 12 గంటల వరకు పోలైన ఓట్లు సుమారు 78.25శాతం అని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో... 1.2శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం 79.4శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం తర్వాత పూర్తి వివరాలు వస్తాయని చెప్పిన మీనా... దాదాపు 81 శాతం పోలింగ్ నమోదవ్వొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా... 2019 ఎన్నికల్లో 79.2శాతం పోలింగ్ నమోదైందని గుర్తు చేశారు.
మరోవైపు ఈ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో.. అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచిన పిఠాపురం నియోజక వర్గంలో 86.87 శాతం పోలింగ్ నమోదైంది. అంటే... మొత్తం 2,36,409 ఓట్లకు గానూ 2,05,369 ఓట్లు పోలయ్యాయి. ఇందులో భాగంగా... 1,03,604 మంది పురుషులు, 1,01,762 మంది మహిళలు, ముగ్గురు ఇతరులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
కాగా... సోమవారం సాయంత్రం పోలింగ్ సమయం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ముకేశ్ కుమార్ మీనా... ఓటరు జాబితా విషయంలో ఈసారి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.