Begin typing your search above and press return to search.

కొత్త రకం కోటీశ్వరులు... రొటీన్ కి పూర్తి భిన్నంగా జీవిస్తున్నారు!

తాజాగా అంతర్జాతీయ మీడియాలో దర్శనమిచ్చిన ఈ కథనాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. వారి వివరాలు ఇప్పుడు చూద్దామ్...!

By:  Tupaki Desk   |   3 Jan 2025 2:30 PM GMT
కొత్త రకం కోటీశ్వరులు... రొటీన్  కి పూర్తి భిన్నంగా జీవిస్తున్నారు!
X

సాధారణంగా కోటీశ్వరుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది.. మల్టీ మిలియనీర్స్ మెయింటినెన్స్ ఎలా ఉంటుంది.. అనేదానికి చాలా మందికి ఓ క్లారిటీ ఉండి ఉండొచ్చు. వారు ధరించే దుస్తులు, పాదరక్షల నుంచి వాడే కారు, ఉండే ఇళ్లు మొదలైనవి అన్నీ ఒక రేంజ్ లో ఉంటాయి! అయితే ఇప్పుడు చెప్పుకోబోయే కోటీశ్వరులు మాత్రం రొటీన్ కి పూర్తి భిన్నం అనే చెప్పాలి.

అవును... తమకు ఉన్న ఆస్తిపాస్తులకు, సంపాదనకు ఏమాత్రం సంబంధం లేకుండా.. పలువురు మల్టీ మిలియనీర్లు చాలా సింపుల్ లైఫ్ గడుపుతున్నారు. అందుకు గల కారణాన్ని వారు తమదైన శైలిలో చెబుతున్నారు. తాజాగా అంతర్జాతీయ మీడియాలో దర్శనమిచ్చిన ఈ కథనాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. వారి వివరాలు ఇప్పుడు చూద్దామ్...!

ఈ సందర్భంగా లాస్ ఏంజెలెస్ కు చెందిన ఓ వ్యాపారవేత్త షాంగ్ సావెడ్రా.. లాస్ వెగాస్ లోని డెంటిస్ట్ రాబర్ట్ చిన్.. రీసెర్చర్ అనూ కోలెదీ మొదలైన వారి లైఫ్ స్టైల్ ఇప్పుడు ఆసక్తిగా మారింది. ముందుగా.. హార్వర్డ్ లో విద్యనభ్యసించి, పర్సనల్ ఫైనాన్స్ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్న షాంగ్ సావెడ్రా అనే వ్యాపారవేత్త దంపతుల లైఫ్ స్టైల్ తెలుసుకుందామ్!

షాంగ్ దంపతులు లాస్ ఏంజెలెస్ కు చెందిన మల్టీ మిలియనీర్స్. అయితే వీరి లైఫ్ స్టైల్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఫోర్ బెడ్ రూమ్స్ ఇంటిని అద్దెకు తీసుకున్న వీరు.. పిల్లలకు సెకండ్ హ్యాండ్ దుస్తులు, ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టిన సెకండ్ హ్యాండ్ బొమ్మలే కొంటారంట. ఇక వీరు వాడుతున్న కారూ కూడా సుమారు 16 ఏళ్ల క్రితంది అని చెబుతున్నారు.

అయితే... పిల్లల చదువు, ఇన్వెస్టిమెంట్స్, డొనేషన్స్ వంటి వాటికి మాత్రం ఎక్కువ డబ్బు వెచ్చిస్తారంట. లాస్ ఏంజెల్సీ లో నివసిస్తున్న వీరికి న్యూయార్క్ లోనూ ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. ఇక డెంటిస్ట్ రాబర్ట్ చిన్ - జెసికా ఫారర్ దంపతుల లైఫ్ స్టైల్ కూడా ఇలానే ఉంటుందని చెబుతున్నారు. లక్షల్లో జీతాలు పొందుతున్న వీరు ఇద్దరూ ఒక కారునే వాడుతుంటారంట.

ఇదే సమయంలో... లక్షల్లో జీతాలు పొందుతున్న వీరు లంచ్ కు బాసులు ఇంటినుంచి తీసుకుని వెళ్లడంతో పాటు నెలవారీ సరుకులు, దుస్తులు అన్నీ హోల్ సేల్ గానే కొనేస్తారంట. ఇక బయట ఫుడ్ అనేది నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమేనని చెబుతున్నారు. వీరు లాస్ వెగాస్ లోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటూ.. ఆఫ్టర్ రిటైర్మెంట్ అధిక ఆదాయం పొందేలా డిజైన్ చేసుకుంటున్నారంట.

ఇక పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్ పర్ట్ గా పని చేస్తున్న రీసెర్చర్ అనీ కోలెది కూడా ఈ తరహా లైఫ్ స్టైలే అని చెబుతున్నారు. సుమారు మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆస్తులున్న ఆమె.. డబ్బును ఎలా పొదుపు చేయాలో, పెట్టుబడి పెట్టాలో మహిళలకు విలువైన సూచనలు ఇస్తుంటారు. ఆమె ఇంట్లో ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు.

ఏడాదిలో మూడుసార్లు మాత్రమే దుస్తులు కొనే ఆమె.. ఎక్కువగా సెకండ్ హ్యాండ్ దుస్తులనే వాడుతుంటారంట. ఇక విమాన ప్రయాణాల విషయంలోనూ ప్రధానంగా డిస్కౌంట్లు, ఆఫర్స్ ను సద్వినియోగం చేసుకుంటారని చెబుతున్నారు. నేడు ఎంత ఉన్నా.. రేపటి కోసం వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి!