మైనర్లతో సహా అనేక మంది భార్యలు... ఏమిటీ మత గురువు కథ?
మతం ఏదైనప్పటికీ ఆ మతం ముసుగులో తప్పుడు పనులు చేస్తున్న మత గురువుల సంఖ్య ఇటీవల పెరిగిపోతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Dec 2024 9:30 AM GMTమతం ఏదైనప్పటికీ ఆ మతం ముసుగులో తప్పుడు పనులు చేస్తున్న మత గురువుల సంఖ్య ఇటీవల పెరిగిపోతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. బాబాలు, పాస్టర్లు, పండితులు, సెయింట్ లు... మతం ఏదైనా, హోదా మరేదైనా వీరిలో పలువురు తప్పుడు పనులు చేస్తున్నారు.. తాము మానవాతీత శక్తులమన్నట్లుగా అమాయకులు నమ్మిస్తున్నారని అంటున్నారు
ఈ కోవకు చెందినవారు ఇప్పటికే చాలా మంది జైల్లలో మగ్గుతుండగా.. మరికొంతమంది కేసులు ఎదుర్కోంటున్నారని అంటున్నారు. ఇంకొంతమంది పాపం పండకో ఏమో కానీ.. దొరకడం లేదని చెబుతున్నారు. ఈ సమయంలో... సుమారు 20 మంది మహిళలను ఆధ్యాత్మిక భార్యలుగా పేర్కొంటూ ఓ మత గురువు లైంగిక నేరాలకు పాల్పడ్డ వ్యవహారం తెరపైకి వచ్చింది.
అవును... పలువురు మైనర్లు సహా అనేకమంది మహిళలను ఆధ్యాత్మిక భార్యలుగా పేర్కొంటూ శామ్యూల్ బాటెమ్యాన్ అనే ఓ మత గురువు వారిపై లైంగిక నేరాలకు పాల్పడిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన లైంగిక వాంఛను తీర్చుకునేందుకు వివిధ దేశాల నుంచి బాలికలను అక్రమ రవాణా చేశాడని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ఫండమెంటలిస్ట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్ (ఎఫ్.ఎల్.డీ.ఎస్) అనేది ఒక ఫండమెంటలిస్ట్ గ్రూప్ అంట. దీనిలోని గ్రూపు సభ్యులు మహిళలను ఆధ్యాత్మిక భార్యలుగా పేర్కొంటు లైంగిక నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తనను తాను ప్రవక్తగా ప్రకటించుకున్నారు శామ్యూల్ బాటేమ్యాన్.
ఈ సమయంలో తన అనుచరులతో పలువురు మహిళలను రప్పించుకొని, వారిని తన భార్యలుగా ప్రకటించుకునేవాడట. ఈ నేపథ్యంలోనే 2022లో శామ్యూల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో నిందితుడికి సంబంధించిన అనేక ప్రాంతల్లో 11 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలికలు అనేక మందిని పోలీసులు కనుగొన్నారని అంటున్నారు.
వీరిలో పలువురు ఇతర దేశాలకు చెందినవారని.. వారిని అక్రమంగా రవాణా చేశారనే విషయాన్ని స్వయంగా నిందితుడే విచారణలో అంగీకరించాడని అంటున్నారు. వీరిలో కొంతమంది వీరి కల్లబొల్లి కబుర్లు నమ్మి రాగా.. మరికొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్లు పోలీసుల వద్ద చెప్పాడని అంటున్నారు.
ఈ నేపథ్యంలో... ఈ కేసుపై విచారణ జరిపిన అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు నిందితుడికి 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఒక్కో బాధితురాలికి ఒక మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొంది. అంతేకాకుండా... నిందితుడికి సంబంధించిన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. దీంతో... ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.