ఆలస్యం చేశాడని క్యాబ్ డ్రైవర్ పై మహిళ దాడి... వీడియో వైరల్!
అవును... ముంబై ఎయిర్ పోర్టు నుంచి ఇటీవల ఓ వీడియో వైరల్ గా మారింది. విమానం తప్పిపోయిందనే కారణంతో ఓ మహిళ ఓలా క్యాబ్ డ్రైవర్ పై దాడికి పాల్పడింది.
By: Tupaki Desk | 26 Jan 2025 6:59 AM GMTఇటీవల కాలంలో హింసకు పాల్పడటం ద్వారా తమ కోపాన్ని ప్రదర్శించే ఘటనలు ఎక్కువగా తెరపైకి వస్తున్నాయి. అవతలి వ్యక్తి తమకంటే హోదాలోనో, స్థోమతలోనో తక్కువ వారిగా అపినిస్తే వెంటనే చేయి చేసుకోవడం పరిపాటిగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో తాజాగా ఎయిర్ పోర్టుకు ఆలస్యంగా తీసుకెళ్లాడని ఆరోపిస్తూ క్యాబ్ డ్రైవర్ పై మహిళ దాడికి పాల్పడింది.
అవును... ముంబై ఎయిర్ పోర్టు నుంచి ఇటీవల ఓ వీడియో వైరల్ గా మారింది. విమానం తప్పిపోయిందనే కారణంతో ఓ మహిళ ఓలా క్యాబ్ డ్రైవర్ పై దాడికి పాల్పడింది. ఎక్స్ లో షేర్ చేయబడిన ఈ వీడియోలో.. డ్రైవర్ పై కోపంతో ఊగిపోతూ అతడిని తన్నడం, కొట్టడం.. ఫ్లైట్ మిస్ అయిపోవడానికి అతనిపై నిందలు వేయడం కనిపిస్తుంది.
వాస్తవానికి ఆమె ఇంటి నుంచి ఆలస్యంగా బయలుదేరినట్లు చెబుతున్నారు. అయితే.. ఆ కారణంగా ఆ మహిళ తన ఫ్లైట్ మిస్ అయితే.. ఆమె తన తప్పును అంగీకరించకుండా, దాన్ని కప్పిపుచ్చుకుంటూ క్యాబ్ డ్రైవర్ పై తన ప్రతాపాన్ని చూపింది.. ఇది అతడి నిర్లక్ష్య ఫలితం అంటూ మండిపడింది.
దీంతో... ముంబై ట్రాఫిక్ పై అవగాహన ఉన్నవారి ఎవరైనా కాస్త ముందుగానే బయలుదేరాలన్న ఇంగితం ఆమె కలిగి లేనట్లున్నారని అంటున్నారు. ఈ సమయంలో క్యాబ్ డ్రైవర్ పై ఆమె ప్రవర్తన దూకుడుగా ఉండటమే కాకుండా.. చాలా అగౌరవంగా కూడా ఉంది. ప్రస్తుతం ఈ వీడియోలో ఆ మహిళ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సమయంలో నిత్యావసర సేవలు అందించేందుకు ఎక్కువ గంటలు పనిచేసే ఇలాంటి వారి విషయంలో ఈ తరహా చర్యలు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వీటిపై స్పందిస్తున్న పోలీసులు.. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరారు.