అర్థరాత్రి మహిళలు అసభ్యకర మెసేజ్ లు... కోర్టు కీలక తీర్పు!
అవును... ముంబైలో మాజీ కార్పొరేటర్ అయిన మహిళకు ఓ గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి సమయంలో అసభ్యకరమైన, అశ్లీల మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టాడు.
By: Tupaki Desk | 22 Feb 2025 12:30 AMతెలిసిన వారు కొంతమంది.. తెలియనివారు ఇంకొంతమంది.. మహిళలకు అర్థరాత్రులు అభ్యంతరకర, అసభ్యకర మెసేజ్ లు పెడుతుంటారు.. తర్వాత చిక్కులు కొని తెచ్చుకుంటారు. మద్యం మత్తులో పెడుతుంటారో.. మానసిక పరిస్థితి బాగోక పెడుతుంటారో తెలియదు కానీ.. ఇలాంటి అసభ్యకర పనులకు పూనుకుంటారు.
ఈ క్రమంలో.. ఇలాంటి పనికి పూనుకున్న ఓ వ్యక్తికి తాజాగా ముంబై కోర్టు షాకిచ్చింది. "నువ్వు స్లిమ్ గా ఉన్నావ్.. చాలా అందంగా ఉన్నావ్.. నువ్వంటే నాకు ఇష్టం.." అంటూ గుర్తు తెలియని మహిళకు మెసేజ్ లు చేయడం అసభ్యకరమని ముంబైలోని సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో.. మెసేజ్ లు పంపిన వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ముంబైలో మాజీ కార్పొరేటర్ అయిన మహిళకు ఓ గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి సమయంలో అసభ్యకరమైన, అశ్లీల మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టాడు. దీనిపై ఆమె ఫిర్యాదు చేసింది. వ్యవహారం కోర్టుకు చేరింది. దీంతో.. 2022లో మేజిస్ట్రేట్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి 3 నెలలు జైలు శిక్ష విధించింది.
దీంతో.. నిందితుడు ఈ తీర్పును సెషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఇతర కారణాలతో పాటు రాజకీయ శత్రుత్వం కారణంగా తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని నిందితుడు పేర్కొన్నాడు. అయితే... కోర్టు ఇతడి వాదనలను తోసిపుచ్చింది. ఈ వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు చెప్పింది.
ఇదే సమయంలో... ఏ స్త్రీ కూడా తన గౌరవాన్ని పణంగా పెట్టి తప్పుడు కేసులో ఇరికించదని పేర్కొంది. నిందితుడు ఆ మహిళకు అశ్లీల వాట్సప్ సందేశాలు, ఫోటోలు పంపాడని ప్రాసిక్యూషన్ నిరూపించిందని కోర్టు తెలిపింది. దీంతో.. మేజిస్ట్రేట్ కోర్టు విధించిన శిక్షను సెషన్స్ కోర్టు జడ్జి సమర్థించారు.