బిష్ణోయ్ బ్రదర్ పై అమెరికా కీలక అప్ డేట్.. ముంబై క్రైమ్ బ్రాంచ్ అలర్ట్!
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Nov 2024 8:10 AM GMTఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. జైల్లో ఉండి మరీ కథంతా నడుపుతున్న బిష్ణోయ్ గ్యాంగ్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో అమెరికా నుంచి కీలక సమాచారం వచ్చిందని అంటున్నారు.
అవును... ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ పేరు మారుమోగిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. తాజాగా ఓ కీలక పరిణాం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ గురించి అమెరికా అలర్ట్ చేసింది! దీంతో... అతడిని భారత్ కు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు.
వాస్తవానికి లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నప్పటినుంచీ.. బయట ఆ గ్యాంగ్ చేస్తున్న పనులన్నీ అన్మోల్ అండర్ లోనే జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో... బాలీవు డ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కొన్ని నెలల క్రితం కాల్పుల ఘటన సహా అనేక కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్ పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
ఇదే సమయంలో ఇటీవల ముంబైలో సంచలనం సృష్టించిన మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులోని నిందితులతోనూ అన్మోల్ టచ్ లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. అతడిని భారత్ కు రప్పించే ప్రక్రియను ప్రారంభించడానికి అనుమతి కోరుతూ ముంబై పోలీసులు ప్రత్యేక న్యాయస్థానానంలో పిటిషన్ వేశారు.
ఈ సమయంలో.. అమెరిక నుంచి కీలక అప్ డేట్ వచ్చిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా అన్మోల్ కదలికలపై అమెరికా అధికారులు భారత్ కు ఉప్పందించినట్లు చెబుతున్నారు. దీంతో... అతడిని భారత్ కు రప్పించేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెబుతున్నారు.
కాగా... భాను పేరుతో చెలామణి అవుతున్న అన్మోల్ బిష్ణోయ్.. నకిలీ పాస్ పోర్ట్ ఉపయోగించి దేశం విడిచి పారిపోయాడు. అతడిపై సుమారు 18 కేసులు ఉన్నాయి. ఇందులో ఈ ఏడాది ఏప్రిల్ లో సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పుల ఘటన కేసు ఒకటి కాగా.. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్యపైనా ఇతడిపై అభియోగాలు ఉన్నాయి!