Begin typing your search above and press return to search.

బంగారు గణపయ్యకు బీమా చేయించారు.. ఎన్ని వందల కోట్లు అంటే?

దేశవ్యాప్తంగా వినాయక వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఏ గ్రామంలో.. ఏ పట్టణాల్లో... ఏ మూలన చూసిన వినాయకుల సందడే కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   7 Sep 2024 11:52 AM GMT
బంగారు గణపయ్యకు బీమా చేయించారు.. ఎన్ని వందల కోట్లు అంటే?
X

దేశవ్యాప్తంగా వినాయక వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఏ గ్రామంలో.. ఏ పట్టణాల్లో... ఏ మూలన చూసిన వినాయకుల సందడే కనిపిస్తోంది. అందమైన సెట్టింగులు, భారీ గణనాథులతో పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు.. వినాయకుడిని గ్రాండ్‌గా అలంకరించేందుకు ఎంతటి ఖర్చైనా పెడుతుంటారు.

ఏటా ముంబైలో వినాయకుడి వేడుకలను ఎంత అద్భుతంగా నిర్వహిస్తుంటారో చూస్తూనే ఉంటాం. కిలోల కొద్దీ బంగారం, వజ్రాలతో పొదిగి ఉన్న కిరీటాలను అలంకరించి విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. అంతేకాదు.. కోట్ల కరెన్సీతో వినాయకుడిని అలకరిస్తుండడం చూస్తుంటాం. అందులోనూ.. ముంబైలోని జీఎస్‌బీ సేవా మండల్ మహాగణపతి మరింత ఫేమస్.

ఇప్పుడు ఆ గణపతి మరోసారి వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఆ వినాయకుడికి ఏకంగా రూ.400 కోట్లతో బీమా చేయించారు. దీనికి కారణం ఏంటో తెలుసా.. ఆ వినాయకుడిని పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించారు. ముంబై శివారు ప్రాంతమైన మాతుంగాలో ఈ ధనిక వినాయకుడిని ప్రతిష్ఠించారు.

అయితే.. ఎన్ని కోట్ల ఆభరణాలు అలంకరిస్తే రూ.400 కోట్లతో బీమా చేయించారని ఆలోచిస్తున్నారా..! ఈ లంబోదరుడికి ఏకంగా 66 కేజీల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారట. ఇంత పెద్ద మొత్తంలో అలంకరించడంతోనే దానికి ఆ స్థాయిలో బీమా చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు.

2023లోనూ ఇక్కడి వినాయకుడికి రూ.360.40 కోట్లతో బీమా తీసుకున్నారు. దాంతో ఈ వినాయకుడు జాతీయ మీడియాను ఆకర్షించాడు. ఇక ఇక్కడికి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సేవలు, క్యూఆర్ కోడ్ వంటివి అందుబాటులో పెట్టారు.