Begin typing your search above and press return to search.

ముంబయిలో రూ.కోటి ప్లాట్.. ఆడి కారు.. ఈ కుర్ర దొంగ దొరికేశాడు

ఈ కేసుల్లో తెలంగాణలోనూ.. ఏపీలోనూ రెండేసి కేసులు ఉన్నాయి. ముంబయిలో ఇతగాడికి కోటి రూపాయిలు విలువ చేసే ప్లాట్ ఉన్నట్లు గుర్తించారు.

By:  Tupaki Desk   |   7 July 2024 9:30 AM GMT
ముంబయిలో రూ.కోటి ప్లాట్.. ఆడి కారు.. ఈ కుర్ర దొంగ దొరికేశాడు
X

దొంగలు సైతం దర్జా జీవితాన్ని గడిపేయటమే కాదు.. మరింత దర్జాగా దొంగతనాలకు పాల్పడుతున్న వైనం షాక్ కు గురి చేస్తుంది. తాజాగా గుజరాత్ పోలీసులకు చిక్కిన ఒక దొంగ గురించి తెలిస్తే నోట మాట రాకపోవటమే కాదు.. షాక్ కు గురి చేస్తుంది. వేర్వేరు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దొంగతనాలకు పాల్పడే ఈ కుర్ర దొంగకు ముంబయిలో ఏకంగా రూ.కోటి విలువ చేసే ప్లాట్ మాత్రమే కాదు.. అతడి దర్జాకు ఏ మాత్రం తగ్గని రీతిలో ఆడి కారును మొయింటైన్ చేస్తున్న వైనం వెలుగు చూసింది.

ఇంతకూ ఇతగాడు ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. ఇతడి పేరు రోహిత్ కానుభాయ్ సోలంకి. ఇతడ్ని చూసినంతనే పక్కింటి కుర్రాడిలా ఉండటమే కాదు.. ఇతడి వస్త్రధారణ.. మొయింటెన్సు చూస్తే ఎక్కడో మంచి జాబ్ చేస్తూ.. లగ్జరీగా బతికేస్తున్నాడన్న భావన కలుగుతుంది. కానీ.. ఇతగాడు చేసే వ్యవహారాలు మాత్రం వేరు. వివిధ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడిన అతడిపై 19 కేసులు నమోదై ఉన్నాయి.

ఈ కేసుల్లో తెలంగాణలోనూ.. ఏపీలోనూ రెండేసి కేసులు ఉన్నాయి. ముంబయిలో ఇతగాడికి కోటి రూపాయిలు విలువ చేసే ప్లాట్ ఉన్నట్లు గుర్తించారు. అన్నింటి కంటే షాకింగ్ అంశం ఏమంటే.. ఇతడు ఆడి కారును మొయింటైన్ చేస్తున్నాడు. ఉదయం వేళలో రెక్కీలు నిర్వహించే ఇతగాడు రాత్రి అయ్యేసరికి చోరకళ మీద ఫోకస్ చేస్తాడు.

ఆ తర్వాత డ్యాన్స్ బార్ లు.. నైట్ క్లబ్ లకు వెళతాడు. డ్రగ్స్ కూడా తీసుకుంటాడన్న విషయాన్ని గుర్తించారు. ఇటీవల ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవటానికి తన పేరును అర్హన్ గా మార్చుకున్నారు. దర్జాగా చోరీలకు పాల్పడటం.. ఆ తర్వాత విలాసవంతంగా జీవితాన్ని గడిచే అతను తాజాగా రూ.లక్ష చోరీ చేసి గుజరాత్ లో దొరికేశాడు. ఇతడి పాపాలు పండాయని చెప్పక తప్పదు.