మొబైల్ యాప్ లో లైవ్ పోర్న్ షో... ముగ్గురు అరెస్ట్!
ముంబైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది వ్యక్తులు మొబైల్ యాప్ ద్వారా లైవ్ పోర్న్ షో చేస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది
By: Tupaki Desk | 8 Nov 2023 1:30 AM GMTముంబైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది వ్యక్తులు మొబైల్ యాప్ ద్వారా లైవ్ పోర్న్ షో చేస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. ఈ సమయంలో ఆ సమాచారం పక్కా అని తెలుసుకున్న పోలీసులు సరిగ్గా ఈ షూటింగ్ జరుగుతున్న ఫ్లాట్ పై దాడిచేశారు! ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు.
అవును... మొబైల్ యాప్ ద్వారా లైవ్ పోర్న్ షోలను ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలపై ముగ్గురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ మేరకు యాప్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ముంబైలో మొబైల్ యాప్ ద్వారా పొర్న్ ని షూట్ చేస్తూ లైవ్ ఇస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో... గూగుల్ ప్లే స్టోర్లో పిహు అఫీషియల్ యాప్ అనే మొబైల్ అప్లికేషన్ గురించి తమకు విశ్వసనీయ సమాచారం అందిందట. దీంతో ఆ సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత పోలీసులు వెర్సోవాలోని ఫోర్ బంగ్లాలోని ఒక ఫ్లాట్ పై దాడి చేశారు.
ఈ సమయంలో యాప్ ఆపరేషన్ లో పాల్గొన్న తనీషా రాజేష్ కనోజియా(20), రుద్ర నారాయణ్ రౌత్ (27), తమన్నా ఆరిఫ్ ఖాన్ (34)లను అరెస్టు చేశారు పోలీసులు! ఈ సందర్భంగా... ఈ ముగ్గురిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అసభ్యకర చర్యలకు పాల్పడడం, యువతకు అసభ్యకరమైన వస్తువులను విక్రయించడం మొదలైన అభియోగాలు మోపినట్లు తెలుస్తుంది.
అదేవిధంగా... ఈ యాప్ లో లైవ్ సెక్స్ వీక్షించినందుకు వినియోగదారుల నుంచి రూ.1,000 నుండి రూ. 10,000 వరకు వసూలు చేస్తున్నారని ముంబై పోలీసులు చెబుతున్నారు! దీంతో మరిన్ని సెక్షన్లు తోడయ్యే అవకాశం ఉందని అంటున్నారు!
కాగా... ఇంటర్నెట్ లో అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉన్నా.. గుట్టుచప్పుడు కాకుండా పోర్న్ వీడియోలు చూసేస్తూ సంబరపడిపోతున్నా.. పప్పులో కాలేసినట్టేనని.. ఆ సమయంలో నిరంతర నిఘా కొనసాగుతోందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా... చూసే ప్రతి పోర్న్ వీడియో, సైట్ నే కాదు.. నెట్ లో ప్రతి కదలికను గమనిస్తున్నాయని చెబుతున్నారు!