Begin typing your search above and press return to search.

అతిగా ప్రేమిస్తున్నాడు విడాకులు కావాలి..లాయర్ పోస్ట్ వైరల్!

ఇందులో భాగంగా... లాయర్ కౌల్ తన ఇన్‌ స్టాగ్రాంలో ఓ వీడియో పోస్ట్ చేసారు. అందులో ఇటీవల జంటలు విడిపోవడానికి గల కారణాలను తెలిపారు

By:  Tupaki Desk   |   16 Oct 2023 4:40 AM GMT
అతిగా ప్రేమిస్తున్నాడు విడాకులు కావాలి..లాయర్ పోస్ట్ వైరల్!
X

భార్య భర్తల సంబంధం గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతుంటారు. ఎవరి అనుభవం మేరకు వారు ఆ బంధాన్ని వర్ణిస్తుంటారు! అయితే ఈ మధ్యకాలంలో.. మరి ముఖ్యంగా గత దశాబ్ధ కాలంగా భార్యాభర్తల అన్నోన్యత, ఆప్యాయత, ఆదరణ, అనురాగం సంగతి కాసేపు పక్కనపెడితే... అనవసరమైన విషయాలకు సైతం విడాకుల వరకూ వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి! దీనికి సంబంధించి ముంబయికి చెందిన లాయర్, కంటెంట్ క్రియేటర్ తాన్య అప్పచు కౌల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... విడాకులు ఎందుకు తీసుకుంటారు అంటే వన్ వర్డ్ ఆన్సర్ చెప్పడం కష్టం అని అంటారు. కానీ... ఇప్పుడన్నీ వన్ వర్డ్ చెప్పే విడాకులకు అప్లై చేస్తున్నారని అంటున్నారు తాన్య కౌల్! వాస్తవానికి కొందరు మూర్ఖురాలైన భార్యలు తమ భర్తలను బానిసగా చేసి తను యజమానిగా ఉంటుంటే.. తెలివైన భార్యలు తన భర్తలను రాజుగా చేసి తను రాణిగా ఉంటుందని అంటారు.

ఇదే సమయంలో తనకు ఈ లోకంలో ఇద్దరు తల్లులు... ఒకరు కన్న తల్లి, రెండో ఆమె సహధర్మచారిణిగా వచ్చిన తల్లి అని భావిస్తే... మరి కొంతమంది జీతం లేని పనిమనిషి అని భావిస్తారని అంటుంటారు! అ సంగతి అలా ఉంటే... ఈ మధ్య కాలంలో ప్రతీ చిన్న చిన్న విషయాలకూ విడాకులు తీసుకుంటున్నారని.. అవి వినడానికి చాలా సిల్లీగా ఉంటాయని అంటున్నారు. అయితే ఇలాంటి విషయాల్లొ ఒక లాయర్ గా తన అనుభవాలను పంచుకున్నారు తాన్య కౌల్!

"అమెరికాలో అంతేనమ్మా... తలుపుకి గొళ్లెం పెట్టలేదని, పొయ్యి మీద కాఫీ పెట్టలేదని, కుక్కకి గొలుసు కట్టలేదని.. దేనికైనా విడాకులిచ్చేస్తారు" అన్ని ఒక సినిమాలో బ్రహ్మానందం అంటారు! అది సినిమాలో డైలాగ్ అని లైట్ తీసుకుని ఉండొచ్చు కానీ... భారత్ లో కూడా దాదాపు అలాంటి రీజన్సే చెప్పి విడాకులకు ధరఖాస్తు చేస్తున్నారని తాన్య కౌల్ చెబుతున్నారు.

ఇందులో భాగంగా... లాయర్ కౌల్ తన ఇన్‌ స్టాగ్రాంలో ఓ వీడియో పోస్ట్ చేసారు. అందులో ఇటీవల జంటలు విడిపోవడానికి గల కారణాలను తెలిపారు. హనీమూన్ టైంలో భార్య అసభ్యంగా దుస్తులు ధరించడం ఒక కారణమని.. భర్త పాదాలకు నమస్కరించడానికి భార్య తిరస్కరించిందని.. భార్యకు వంట చేయడం రాకపోవడంతో బ్రేక్ ఫాస్ట్ లేకుండానే ఉద్యోగానికి వెళ్లవలసి వచ్చిందని.. భర్త సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతూ భార్యకు తగిన సమయం ఇవ్వలేదని.. ఇలాంటి కారణాలతో విడిపోతున్నారంటూ ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. పైకి కనిపిస్తోన్నది వేరు.. సంస్కృతి, సంప్రదాయాలు అని చెప్పుకునే భారత్ లో అంతర్లీనంగా జరుగుతున్నది వేరు అనే చర్చ ఈ సందర్భంగా స్టార్ట్ అయ్యిందని చెబుతున్నారు! ఇదే సమయంలో... "భర్త అతిగా ప్రేమ, శ్రద్ధ చూపుతాడని.. అస్సలు గొడవ పడడని" ఓ మహిళ చేసిన ఫిర్యాదును కూడా లాయర్ కౌల్ తన పోస్టులో ప్రస్తావించారు. దీంతో... ఇది కూడా విడాకులకు ఒక కారణమా అని ముక్కున వేలేసుకుంటున్నారు!

అవును... 2020 లో ఉత్తరప్రదేశ్‌ లో ఓ మహిళ తన భర్త తనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, పెళ్లైన 18 నెలలో ఎప్పుడూ గొడవ పడలేదనే కారణాలను చెబుతూ... అతని నుండి విడాకులు కావాలని పిటిషన్ దాఖలు చేసిందని వివరిస్తున్నారు కౌల్. దీంతో... కౌల్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌ గా మారింది. దీంతో జంటలకు ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ తప్పనిసరి చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క.. ఒక్క సారి కమిట్ అయ్యకా విడాకుల విషయంలో ఎవరి మాటా వినరేమో అని మరికొంతమంది అంటున్నారు!