Begin typing your search above and press return to search.

యూపీలో ముషారఫ్ పూర్వీకుల భూమి... ఏమిటీ 'శత్రు ఆస్తి'?

ఈ సమయంలో భారత్ లో ఉన్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడి పూర్వికులు ఆస్తుల వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   7 Sep 2024 5:33 AM GMT
యూపీలో ముషారఫ్  పూర్వీకుల భూమి... ఏమిటీ శత్రు ఆస్తి?
X

భారత్ – పాక్ విడిపోయి ఇంతకాలం అయినా ఇప్పటికీ ఇక్కడున్నవారి బందువులు అక్కడ.. అక్కడ వారి రక్తసంబంధికులు ఇక్కడ చాలా మందే ఉన్నారని అంటారు. అప్పట్లో పాక్ వెళ్లాలని అనుకున్నవాళ్లు అటు వెళ్లగా.. భారత్ తోనే తమ బంధం అనుకున్నవారు ఇక్కడే ఉంటున్నారు. ఈ సమయంలో భారత్ లో ఉన్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడి పూర్వికులు ఆస్తుల వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది.


అవును... పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పూర్వికులకు సంబంధిచిన ఆస్తులు భారత్ లో ఉన్నాయి. అవి సుమారు రెండు హెక్టార్ల భూమి అని అధికారులు ప్రకటించి వేలం వేశారు. దీంతో... ఆ రెండు హెక్టార్ల భూమిని రూ.1.38 కోట్లకు వేలం వేసినట్లు వెల్లడించారు. ఈ భూమి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగ్ పత్ జిల్లా బడౌత్ తహసీల్ లోని కోటానా గ్రామం వద్ద ఉంది.

దేశ విభజనకు ముందు ఢిల్లీలో జన్మించిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ 2023లో మరణించిన సంగతి తెలిసిందే. 1999 తిరుగుబాటు తర్వాత ఆయన పాక్ లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయన తాత యూపీలోని కోటానా గ్రామంలో నివసించారని బడౌత్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ అమర్ వర్మ ధృవీకరించారు.

ఇదే క్రమంలో... ముషారఫ్ పూర్వికులకు కోటానాలో ఉమ్మడి ఆస్తితో పటు ముషారఫ్ మామ హుమయూన్ నివసించిన ఇల్లు కూడా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో... ఇక్కడున్న రెండు హెక్టార్ల భూమిని రూ.39.06 లక్షల ప్రాథమిక ధరతో వేలం వేయగా.. రూ.1.38 కోట్లు పలికిందని వెల్లడించారు. ఈ మొత్తాన్ని హోంశాఖ ఖాతాలో జమ చేయనున్నారు!

వాస్తవానికి ముషారఫ్ పూర్వికులకు ఉన్న భూమిని 2010లోనే "శత్రు ఆస్తి"గా ప్రకటించారు అధికారులు. అంటే... పాకిస్థానీ పౌరుల యాజమాన్యం కింద భారతదేశంలో ఉన్న ఆస్తులను "శత్రు ఆస్తి" వర్గీకరణగా పరిగణిస్తారు. వీటిని సెంట్రల్ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని “కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ విభాగం” నిర్వహిస్తుంది.