Begin typing your search above and press return to search.

మూసీకి.. సియోల్ లోని హాన్ కు మధ్య తేడాలేంటి?

మూసీ ప్రక్షాళనకు రేవంత్ సర్కారు ఎంత ప్రయారిటీ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   23 Oct 2024 10:30 AM GMT
మూసీకి.. సియోల్ లోని హాన్ కు మధ్య తేడాలేంటి?
X

మూసీ ప్రక్షాళనకు రేవంత్ సర్కారు ఎంత ప్రయారిటీ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ బడ్జెట్ కు సైతం సిద్ధమైంది. దీనిపై విపక్షాలు విరుచుకుపడుతున్నా కేర్ చేయట్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొలువు తీరిన కేసీఆర్ సర్కారు సైతం మూసీ రూపురేఖలు మార్చేందుకు చేస్తున్న కసరత్తు అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. మూసీ ప్రక్షాళనకు సౌత్ కొరియాలోని సియోల్ లో ఉన్న హాన్ నదిని స్పూర్తిగా తీసుకొని.. ప్రక్షాళన చేసే ఆలోచనలో ఉండటం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి ఒకసారి అక్కడకు వెళ్లటం.. అక్కడ చేపట్టిన ప్రాజెక్టును చూడటం తెలిసిందే.

గత శనివారం తెలంగాణ రాష్ట్రం నుంచి పలువురు అధికారులు.. రాజకీయ నేతలతో పాటు.. మీడియా ప్రతినిధులను సౌత్ కొరియాకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడున్న పరిస్థితుల మీద ప్రత్యేక ఫోకస్ వచ్చింది. ఈ క్రమంలో తెర మీదకు వచ్చిన మొదటి ప్రశ్న.. మూసీకి.. హాన్ నదికి పోలిక పెట్టొచ్చా? దాని సైజ్.. మూసీ సైజు ఒక్కటేనా? మూసీ నది సరే.కానీ.. దానితో పోలిక పెడుతున్న హాన్ నది కాదని.. ఒక కాలువగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వేళ.. ఈ రెండింటి మధ్య ఉన్న పోలికలు ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

హైదరాబాద్ మహా నగరాన్ని వరదలు మంచెత్తిన సమయంలో నగరాన్ని కాపాడేందుకు వీలుగా మూసీని ప్రక్షాళించటం.. దానిని విస్తరించటం లాంటి భారీ ప్రాజెక్టును రేవంత్ సర్కారు తలకెత్తుకుంది. ఇంతకూ సౌత్ కొరియాలోని హాన్ తో మూసీని పోల్చవచ్చా? దానికి అంత స్థాయి ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. హాన్ నదిని ప్రక్షాళన చేసే సమయంలో అక్కడి ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబుడులు పెట్టిందని.. పాలకుల చిత్తశుద్దితో పాటు సుస్థిరతతోనే నది సుందరీకరణకు సాధ్యమైందని.. ప్రజా వినోద కేంద్రంగా హాన్ గణనీయంగా డెవలప్ అయ్యింది. అంతేకాదు.. హాన్ నదిని సియోల్ నగరంలో వరద నీటి నియంత్రణ.. నీటి నిర్వాహణ కోసం వినియోగిస్తున్నారు.

మూసీ వర్సెస్ హాన్ నదిని చూస్తే..

మూసీ వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టింది. హిమాయత్ సాగర్.. ఉస్మాన్ సాగర్ నుంచి హైదరాబాద్ లోకి ప్రవేశిస్తుంది. పాత.. కొత్త నగరాలను రెండుగా విభిజిస్తూ పురానాపూల్.. డబీర్ పురా.. అంబర్ పేట.. చాదర్ ఘాట్.. ఉప్పల్ మీదుగా నగరం నడిబొడ్డు నంుచి మిర్యాలగూడ సమీపంలోని వాడపల్లి వద్ద క్రిష్ణా నదిలో కలుస్తుంది.

ఇక.. హాన్ విషయానికి వస్తే సౌత్ కొరియా ఉత్తర భాగంలోతైబెక్ సన్ మేక్ పర్వతాల్లో పుట్టిన ఈ నది.. గాంగ్వాన్.. జియోంగ్లీ.. ఉత్తర చుంగ్ చియాంగ్ ప్రావిన్సుల ద్వారా సియోల్ నగరంలోకి ప్రవేశిస్తుంది. ఈ నగరంలో సుమారు 40కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ.. పశ్చిమాన ఉన్న ఎల్లో సీలో కలుస్తుంది.

మూసీ నది మొత్తం పొడవు 240కి.మీ. కాగా.. హైదరాబాద్ లో 57.5 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. అదే సమయంలో హాన్ నది విషయానికి వస్తే దీని పొడవు 514కిలోమీటర్లు కాగా.. సియోల్ నగరంలో 40కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఈ లెక్కన చూస్తే.. హాన్ ప్రక్షాళనను మూసీ ప్రక్షాళన కోసం స్పూర్తిగా తీసుకోవటం సానుకూలాంశమేనని చెబుతున్నారు.