Begin typing your search above and press return to search.

మూసీ ఎఫెక్ట్... "నా హౌస్ సీఎంకి ఇస్తాను.. నాకు సీఎం హౌస్ కావాలి"!

తెలంగాణ రాజకీయాల్లో నిన్నటి వరకూ "హైడ్రా" అనేది హాట్ టాపిక్ కాగా.. ఇప్పుడు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అంశం తీవ్ర సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   18 Nov 2024 6:17 AM GMT
మూసీ ఎఫెక్ట్... నా హౌస్  సీఎంకి ఇస్తాను.. నాకు సీఎం హౌస్  కావాలి!
X

తెలంగాణ రాజకీయాల్లో నిన్నటి వరకూ "హైడ్రా" అనేది హాట్ టాపిక్ కాగా.. ఇప్పుడు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అంశం తీవ్ర సంచలనంగా మారింది. వాళ్లను ఇంకా మురికి వాతావరణంలో ఉన్న బస్తీల్లోనే ఉంచుతారా అని ప్రశ్నిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం బలంగా చెబుతూ.. ముందుకు కదులుతుంది!

ఈ సమయంలో వీరికి శాస్వత పరిష్కారం చూపించాలని.. పునరవాస గృహాలు కల్పిస్తూ, వాటికి పక్కా హక్కులతో పత్రాలు ఇవ్వాలని విపక్షలు డిమాండ్ చేస్తున్నాయని చెబుతున్నారు. మరోపక్క ఉన్నపలంగా మూసీ బస్తీలో ఎంతో కాలంగా ఉంటున్న ప్రజలపై రాజకీయ పార్టీలకు ప్రేమ పుట్టుకొచ్చేసిందేమిటనే చర్చా తెరపైకి వచ్చింది.

ఈ సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పరిష్కారాలు చూపిస్తున్నారని.. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని కొంతమంది అంటుంటే.. ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రం చేసిన తర్వాత అక్కడే తమకు స్థలాలు కేటాయించాలని మరికొంతమంది అంటున్నారనే చర్చా మొదలైంది. ఈ సమయంలో ఓ యువతి ఆసక్తికర ఆప్షన్ తెరపైకి తెచ్చారు.

అవును... హైదరాబాద్ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ నిర్వాసితుల్లో ఒకరైన ఓ యువతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఆమె... తాను కర్ణాటక నుంచి వచ్చి ఉంటున్నట్లు తెలిపారు. తాను ఇక్కడే ఇల్లు కొనుక్కొని, కష్టపడి ఈఎంఐ కడుతున్నట్లు తెలిపారు. తెలుగు కూడా నేర్చుకున్నానని చెబుతూ.. తెలుగులోనే మాట్లాడారు.

ఈ సందర్భంగా.. చాలా మంది తమకు పరిహారం వద్దు అని అంటున్నారని.. అయితే తనకు మాత్రం పరిహారం కావాలని ఆమె వెల్లడించారు. ఇందులో భాగంగా... "నా ఇల్లు సీఎంకు ఇస్తాను.. సీఎం హౌస్ నాకు కావాలి.. నాకు వేరే ఎక్కడా పరిహారం వద్దు.. నాకు సీఎం హౌసే కావాలి.. అది ఇచ్చారంటే నేను రేపే ఇల్లు ఖాళీ చేస్తాను" అని స్పందించారు.

ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం తన ఇళ్లు తీసుకుంటే.. అందుకు పరిష్కారంగా తనకు సీఎం ఇల్లు ఇవ్వాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి!