Begin typing your search above and press return to search.

మస్క్ ఎంటరైతే ఇండియాలో ఇంటర్నెట్ ధరలు తగ్గుతాయా.. పెరుగుతాయా?

అంతర్జాతీయంగా పరిశీలిస్తే.. భారత్ ఇంటర్నెట్ వినియోగంలో ఇంకా వెనుకబడే ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయని అంటున్నారు

By:  Tupaki Desk   |   24 Oct 2024 7:30 AM GMT
మస్క్ ఎంటరైతే ఇండియాలో ఇంటర్నెట్ ధరలు తగ్గుతాయా.. పెరుగుతాయా?
X

అంతర్జాతీయంగా పరిశీలిస్తే.. భారత్ ఇంటర్నెట్ వినియోగంలో ఇంకా వెనుకబడే ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయని అంటున్నారు. భారత జనాభాలో సుమారు 40శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులు లేవని పలు నివేదికలు వెల్లడించాయి! ఈ నేపథ్యంలో... శాటిలైట్ ఇంటర్నెట్ వైపు వినియోగదారులు ఆసక్తి చూపించే అవకాశం ఉంటుందని మస్క్ భావిస్తున్నారని అంటున్నారు.

అవును... భూమిపై ఆపరేట్ చేసే నెట్ వర్క్ లేనప్పుడు, సరిగా పనిచేయనప్పుడు వినియోగదారులు శాటిలైట్ ఇంటర్నెట్ వైపే ఆసక్తి చూపించే అవకాశం ఉంటుందని.. ఇక మారుమూల గ్రామాలు వంటి ప్రాంతాల్లో ఈ ఇంటర్నెట్ సర్వీసులు ఎక్కువగా అవసరం పడతాయని భావిస్తున్న ఎలాన్ మస్క్.. దేశంలో బ్రాండ్ బ్యాండ్ సేవలతో "స్టార్ లింక్"ను ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే భారత శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్ లో ఆధిపత్యం కోసం ఇద్దరు అపర కుబేరుల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోందని అంటున్నారు. ఇందులో భాగంగా... దేశంలో బ్రాండ్ బ్యాండ్ సేవలతో "స్టార్ లింక్"ను ప్రవేశపెట్టేందుకు ఎలాన్ మస్క్ ఆసక్తిగా ఉండగా.. ముకేష్ అంబానీ కూడా ఆసక్తి కనబరుస్తూ, దాన్ని దక్కించుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా... ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ వేలంపాటతో కాకుండా.. పాలనాపరంగా నిర్ణయం తీసుకుని కేటాయిస్తామని ఇటీవల తెరపైకి వచ్చిన ప్రభుత్వ ప్రకటనల నేపథ్యంలో వీరి మధ్య ఇప్పుడు రసవత్తరమైన పోటీ ఉందని అంటున్నారు. అయితే.. అంబానీ మాత్రం స్పెక్ట్రమ్ వేలం విధానాన్ని డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. మస్క్ ప్రణాళికలు మాత్రం మరోలా ఉన్నాయని తెలుస్తోంది.

ఆ సంగతి అలా ఉంటే... నివేదికల ప్రకారం.. భారతదేశంలో బ్య్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్లు వసూలు చేస్తున్న ధరలతో పోలిస్తే స్టార్ లింక్ వసూలు చేస్తున్న చార్జీలు 10 రెట్లు అధికంగా ఉన్నాయి. స్టార్ లింక్ నిర్వహిస్తున్న "లోయర్ ఎర్త్ ఆర్బిట్" శాటిలైట్లు.. "మిడ్ లెవల్ ఎర్త్ ఆర్బిట్" శాటిలైట్ల మాదిరే గ్లోబల్ కవరేజ్ ఇవ్వాలంటే నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి.

ఈ నేపథ్యంలో... శాటిలైట్ ఇంటర్నెట్ కంటే భూతలంలో ఇంటర్నెట్ సర్వీసులకే తక్కువ ఖర్చు అవుతుందని అంటున్నారు. కాకపోతే... భూమిపై ఆపరేట్ చేసే నెట్ వర్క్ లేని మారుమూల ప్రాంతాల్లో ఈ శాటిలైట్ ఇంటర్నేట్ సేవలకు డిమాండ్ ఉండోచ్చని చెబుతున్నారు.