Begin typing your search above and press return to search.

జోబైడెన్ ప్రభుత్వంపై మరో బాంబ్ పేల్చిన ఎలన్ మస్క్

తమ సంస్థ కొన్ని నెలల క్రితమే వ్యోమగాములను రక్షించేందుకు ఓ మిషన్ ప్రతిపాదించినప్పటికీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని మస్క్ ఆరోపించారు.

By:  Tupaki Desk   |   6 March 2025 7:13 PM IST
జోబైడెన్ ప్రభుత్వంపై మరో బాంబ్ పేల్చిన ఎలన్ మస్క్
X

స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తాజాగా బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం.. నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమికి తిరిగి రావడాన్ని జోబైడెన్ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేసిందని అన్నారు. తమ సంస్థ కొన్ని నెలల క్రితమే వ్యోమగాములను రక్షించేందుకు ఓ మిషన్ ప్రతిపాదించినప్పటికీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని మస్క్ ఆరోపించారు.

ఎనిమిది రోజుల మిషన్ కోసం ISS కు వెళ్లిన ఈ వ్యోమగాములు, వైట్ హౌస్ జోక్యంతో ఎనిమిది నెలలకు పైగా కక్ష్యలోనే చిక్కుకుపోయారని మస్క్ అన్నారు. "స్పేస్‌ఎక్స్ మరో డ్రాగన్ క్యాప్సూల్ పంపించి, ఆరుగురు నెలల క్రితమే వారిని భూమికి తీసుకురాగలిగేది. కానీ బైడెన్ ప్రభుత్వం అనుమతించలేదు" అని మస్క్ తాజాగా ఓ చిట్ చాట్ ఇంటర్వ్యూలో ఆరోపించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకొని.. వ్యోమగాములను తిరిగి రప్పించాల్సిందిగా ఒత్తిడి చేశారని పేర్కొన్నారు.

సునీతా విలియమ్స్ - బుచ్ విల్మోర్ 2024, జూన్ 6 న బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా ISS కు చేరుకున్నారు. అయితే వారి రాకపోకలకు ఉపయోగించిన ఆ వ్యోమనౌక భూమికి తిరిగి ప్రవేశించేందుకు సురక్షితం కాదని నాసా ప్రకటించింది. ఈ కారణంగా వారి తిరుగు ప్రయాణాన్ని నిరవధికంగా వాయిదా వేశారు.

-స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లో రీ-ఎంట్రీ

ప్రస్తుతం వీరు స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా భూమికి తిరిగి రానున్నారు. మార్చి 12న కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి క్రూ-10 స్పేస్ ఫ్లయిట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుంది. ఆ తర్వాత సునీతా విలియమ్స్ బృందం భూమికి చేరుకునే అవకాశం ఉంది.

- అంతరిక్ష అనుభవం - విల్మోర్ వ్యాఖ్యలు

ఇంతకాలం అంతరిక్షంలో గడపడం ఒక చక్కటి అనుభూతినిచ్చిందని బుచ్ విల్మోర్ అన్నారు. అయితే, భూమికి తిరిగి రావడం కూడా ఒక సవాలుతో కూడుకున్న అనుభవమేనని, కానీ తాము సురక్షితంగా చేరుకుంటామనే నమ్మకముందని చెప్పారు.