Begin typing your search above and press return to search.

మస్క్ నుంచి వెన్నుపోటు... ట్రంప్ ఇంట్రస్టింగ్ రియాక్షన్!

అవును... ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలప్పటి నుంచి అగ్రరాజ్య రాజకీయాల్లో మస్క్ పేరు కూడా బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Dec 2024 4:50 AM GMT
మస్క్  నుంచి వెన్నుపోటు... ట్రంప్  ఇంట్రస్టింగ్  రియాక్షన్!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేల డొనాల్డ్ ట్రంప్ – ఎలాన్ మస్క్ మధ్య ఉన్న బంధం ఫెవికాల్ బంధంగా మారిందని.. ఇప్పుడు ఇద్దరి పరిస్థితి అవిభక్త కవలల మాదిరిగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. "ప్రెసిడెంట్ మస్క్" అంటూ డెమోక్రాట్ల నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఈ సమయంలో ట్రంప్ స్పందించారు.

అవును... ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలప్పటి నుంచి అగ్రరాజ్య రాజకీయాల్లో మస్క్ పేరు కూడా బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తన కార్యవర్గంలో ఎలాన్ మస్క్ కు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. ట్రంప్ తర్వాత నెంబర్ 2 మస్క్ అనే స్థాయిలో కామెంట్లు వినిపిస్తున్నాయని అంటారు.

దీంతో పాటు మస్క్ ప్రభావం ట్రంప్ పై బాగా పనిచేస్తుందని.. ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లో మస్క్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ నేపథంలో... ఎలాన్ మస్క్ అమెరికా ప్రెసిడెంట్ అవుతారా? అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథంలో.. ఈ వ్యవహారంపై డొనాల్డ్ ట్రంప్ స్పందింస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

త్వరలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న ట్రంప్... ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి ఆరిజోనాలో ఏర్పాటుచేసిన రిపబ్లికన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా... "ప్రెసిడెంట్ మస్క్" అంటూ డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలపై స్పందించారు. ఈ సందర్భంగా.. ఎలాన్ మస్క్ అధ్యక్షుడు కాలేరని తాను చెప్పగలనని అన్నారు.

"ఆయన (ఎలాన్ మస్క్) అధ్యక్షుడు కాలేరు అని నేను చెప్పగలను.. ఎందుకో తెలుసా..?.. ఆయన ఈ దేశంలో జన్మించలేదు" అని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో... ట్రంప్ కు మస్క్ నుంచి ఎలాంటి వెన్నుపోటుకూ ఛాన్స్ లేదన్నమాట అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

కాగా... అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవిని చేపట్టబోయే వ్యక్తి అమెరికాలో జన్మించిన పౌరుడై ఉండాలి. అయితే... టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మస్క్ ను డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ కి సారధిగా నియమించబడిన సంగతి తెలిసిందే. పైగా ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రపంచ దేశాధినేతలతో ఫోన్ లో మాట్లాడిన సమయంలో మస్క్ ను ట్రంప్ తన పక్కనే ఉంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. అమెరికాలో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది.

ఇందులో భాగంగా... ట్రంప్ పాలనలో మస్క్ జోక్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. దీంతో... 'ప్రెసిడెంట్ మస్క్' అంటూ డెమోక్రాట్లు విమర్శలు చేస్తుండగా.. మస్క్ కు ఆ ఛాన్స్ లేదంటూ ట్రంప్ స్పందించారు.