Begin typing your search above and press return to search.

ట్విట్టర్ అనుకున్నావా 'మస్క్'.. ఆ 'డోజ్' కోతలేంది?

ఏకంగా అప్పటి ట్విట్టర్ సీఈవో అయిన ప్రముఖ భారతీయ టెకీ పరాగ్ అగర్వాల్ నే సాగనంపారు.

By:  Tupaki Desk   |   6 March 2025 10:16 PM IST
ట్విట్టర్ అనుకున్నావా మస్క్.. ఆ డోజ్ కోతలేంది?
X

అప్పటివరకూ వేలమందితో నడిచిన ట్విట్టర్ సంస్థ.. ఎప్పుడైతే ‘ఎలన్ మస్క్’ కొనుగోలు చేశాడో అప్పుడే సగానికి సగం మందిని తొలగించేశాడు. ఏకంగా అప్పటి ట్విట్టర్ సీఈవో అయిన ప్రముఖ భారతీయ టెకీ పరాగ్ అగర్వాల్ నే సాగనంపారు. అట్లుంటది మస్క్ కోతలు అంటూ నాడు అందరూ నిట్టూర్చారు.

అయితే ఇప్పుడు ఎలన్ మస్క్ అమెరికా ప్రభుత్వంలోకి వచ్చాడు. ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు సహకరించి కీలకమైన ‘డోజ్’ బాధ్యతలు చేపట్టారు. ఇంకేముంది ట్విట్టర్ లో తొలగించినట్టే అమెరికా ప్రభుత్వంలోని ఉద్యోగులను సాగనంపుతున్నాడు. అది ఏ స్థాయిలో ఉందో లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే.

ఫిబ్రవరిలో ఉద్యోగాల కోతలు జనవరితో పోలిస్తే 245% పెరిగాయని తాజాగా ఔట్‌ప్లేస్‌మెంట్ సంస్థ ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ గురువారం విడుదల చేసిన డేటా బయటపెట్టింది. గత నెలలో ఉద్యోగాలు కోల్పోయిన దాదాపు 1,72,000 మందిలో మూడో వంతుకు పైగా అంటే 62,000 మంది బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రభుత్వ సామర్థ్య విభాగం (DOGE) కోతల వల్ల ఉద్యోగాలు కోల్పోయారని డేటా బయటపెట్టింది. ఇదే ఇప్పుడు సంచలనమైంది. .

ఈ నెలవారీ తొలగింపులు అమెరికా చరిత్రలోనే మొత్తం జూలై 2020 నుండి అతి పెద్దదిగా తెలిపింది.. అలాగే ఫిబ్రవరిలో ఈ స్థాయి ఉద్యోగ కోతలు 2009 నుండి చూడలేదని పేర్కొంది. అప్పట్లో దేశం గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్‌ను ఎదుర్కొంటోంది. నాడు తొలగింపులు ఆర్థిక సంక్షోభం వల్ల జరిగాయి. కానీ ఇప్పుడు ఎలన్ మస్క్ కోతల వల్ల జరిగాయి.

ఈ సంవత్సరం ప్రారంభ రెండు నెలల్లోనే 2,21,000కి పైగా ఉద్యోగాలు కోల్పోయారు.. ముఖ్యంగా వెటరన్స్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రధాన కోతలు ఇప్పటికే ప్రకటించబడ్డాయి.

బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం DOGE కారణంగా ఈ సంవత్సరం చివరి నాటికి ఉద్యోగ కోతలు 5,00,000కి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఎలన్ మస్క్ వల్ల అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు కంటి మీద కునుకులేకుండా బతుకీడుస్తున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది.