మస్క్ ఇంటర్నెట్ ను ఉగ్రవాదులు వినియోగిస్తున్నారా?.. రియాక్షన్ వచ్చేసింది!
అవును... స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ను త్వరలో భారత్ లోనూ ప్రవేశపెట్టాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నారని.. ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్న వేళ ఓ సంచలన విషయం తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 18 Dec 2024 5:02 PM GMTఎలాన్ మస్క్ కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్ లింక్ త్వరలో ఇండియాలో తన సేవలు వినియోగించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసిందని అంటున్నారు. ఇటీవల కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం మస్క్ కు స్టార్ లింక్ విస్తరణ విషయంలో గుడ్ న్యూస్ లాంటిదనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు స్టార్ లింక్ ను వాడుతున్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ను త్వరలో భారత్ లోనూ ప్రవేశపెట్టాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నారని.. ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్న వేళ ఓ సంచలన విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... మణిపూర్ లో హింసాత్మక ఘటనలో ఆగంతకులు స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీనిపై మస్క్ స్పందించారు.
మణిపూర్ లో ఇటీవల పెద్ద ఎత్తున హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... జిర్బామ్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సమయంలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ పలువురు నిరసనలకు దిగుతూ.. 24 గంటల్లో హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు.
ఈ క్రమంలోనే ఇంఫాల్ లో ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై కొందరు దుండగులు దాడిచేసి నిప్పుపెట్టారు. అదేవిధంగా... సీఎం బిరెన్ సింగ్ అల్లుడితో సహా పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ఆందోళన చేశారు.
ఈ ఆందోళనల నేపథ్యలో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఆ ప్రాంతంలో కొన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు కొన్ని ఇంటర్నెట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా... స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో ఇంటర్నెట్ శాటిలైట్ యాంటెన్నా, ఇంటర్నెట్ శాటిలైట్ రూటర్, కేబుల్స్ లభ్యమయ్యాయని పోలీసులు ధృవీకరించారు.
అయితే... పోలీసులు స్వాధీనం చేసుకున్న పరికరాలలో ఒకదానిపై "స్టార్ లింక్" లోగో ఉన్నట్లు గుర్తించారు. దీంతో.. ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. స్టార్ లింక్ శాటిలైట్ ను సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదులు వినియోగిస్తున్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఎక్స్ లో పోస్టులు హల్ చల్ చేశాయి.
దీంతో... ఈ ఆరోపణలపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఇందులో భాగంగా... స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారత్ లో నిలిపివేయబడ్డాయని పోస్ట్ చేశారు!