Begin typing your search above and press return to search.

మైనంపల్లికి బీఆర్ఎస్ చెక్ పెడుతుందా ?

ఎంఎల్ఏతో పాటు ద్వితీయశ్రేణి నేతలు, కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తే అప్పుడు మైనంపల్లి పట్టు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అనుకోవాలి.

By:  Tupaki Desk   |   25 Sep 2023 4:43 AM GMT
మైనంపల్లికి బీఆర్ఎస్ చెక్ పెడుతుందా ?
X

పార్టీకి రాజీనామాచేసిన మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావుకు చెక్ పెట్టడానికి కేసీయార్ రెడీ అవుతున్నారు. నియోజకవర్గంలో నేతలెవరూ మైనంపల్లితో పాటు పార్టీని వీడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయమై నియోజకవర్గంలోని నేతలతో సమావేశం పెట్టుకోవాలని కేసీయార్ అనుకుంటున్నారట. మామూలుగా అయితే మైనంపల్లి చాలా బలమైన నేతనే చెప్పాలి. రెగ్యులర్ గా ద్వితీయ శ్రేణినేతలు, కార్పొరేటర్లతో పాటు మామూలు జనాలతో కూడా ఎంఎల్ఏ చాలా యాక్సెసబుల్ గా ఉంటారు.

రోజులో ఏ సమయంలో అయినా ఎంఎల్ఏతో జనాలు తమ సమస్యలు చెప్పుకునే వెసులుబాటుంది. అలాగే సమస్యల పరిష్కారం విషయంలో చాలా స్పీడుగా ఉంటారని పేరు. కాబట్టి నియోజకవర్గంలో మైనంపల్లికి బాగా పట్టుంది. అయితే ఇదంతా బీఆర్ఎస్ ఎంఎల్ఏగా, కేసీయార్ సన్నిహితుడిగా ఉన్న ముద్రకారణంగానే వచ్చింది. అలాంటి ఎంఎల్ఏ ఇపుడు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. పార్టీ మారిన తర్వాత కూడా నియోజకవర్గంలో మైనంపల్లికి ఇంతే పట్టుంటుందా అన్నది సందేహమే.

ఎంఎల్ఏతో పాటు ద్వితీయశ్రేణి నేతలు, కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తే అప్పుడు మైనంపల్లి పట్టు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అనుకోవాలి. ఎందుకంటే షెడ్యూల్ ఎన్నికలకు ఇక ఉన్నది మహాయితే ఓ మూడు నెలలే కాబట్టి ప్రభుత్వపరంగా ఎంఎల్ఏకి ఎదురయ్యే అడ్డంకులు పెద్దగా ఉండవు.

అక్టోబర్లో గనుక ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే యంత్రాంగమంతా కేంద్ర ఎన్నికల కమీషన్ చేతిలోకి వెళిపోతుంది. కాబట్టి మైనంపల్లి లాంటి ఎంఎల్ఏలు, నేతలకు అసలు రాష్ట్ర ప్రభుత్వం నుండి అసలు ఇబ్బందు లే ఉండవు.

కాకపోతే ఎదురయ్యే ఇబ్బందులు పార్టీ నుండే. అదే పార్టీలోని తన క్యాడర్ మొత్తాన్ని ఎంఎల్ఏ తనతో పాటు కాంగ్రెస్ లో చేర్పించగలిగితే పార్టీ పరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండవనే అనుకోవాలి. ఇదంతా గమనించిన తర్వాత కేసీయార్ వెంటనే ముఖ్యనేతలతో సమావేశం పెట్టమని మంత్రులు హరీష్ రావు, కేటీయార్ ను ఆదేశించారట. తర్వాత పరిస్ధితిని తనకు అప్ డేట్ చేసిన తర్వాత తాను కూడా మీటింగ్ పెడతానని చెప్పారట. మరి మైనంపల్లి ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాల్సిందే.