ధాన్యం కనుగోళ్లపై మనోహర్ ఇంట్రస్టింగ్ గ్రాఫ్... లెక్క మారిందంట!
ఈ సందర్భంగా ఓ గ్రాఫ్ ని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఎవరు అండగా నిలబడ్డారో ఒకసారి చూడాలంటూ ఆ పోస్టులో మంత్రి మనోహర్ సూచించారు.
By: Tupaki Desk | 12 Dec 2024 6:41 AM GMTఏపీలో వరి పండించే రైతుల దుస్థితి వర్ణనాతీతంగా ఉందని.. పంట చేతికొచ్చినప్పటి నుంచి అసలు కష్టాలు మొదలవుతున్నాయని.. పట్టకు గిట్టుబాటు ధర అందడం లేదని.. రైతు భరోసా కేంద్రాల్లో గోనె సంచులు లేవని.. చివరికి దళారులే దిక్కవుతున్నారని.. పెట్టుబడి కూడా రాని విషాధం నెలకొందని తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే!
మరోపక్క ప్రభుత్వాలు మారుతున్నా.. ధాన్య సేకరణ తీరు మాత్రం మారడం లేదని.. తేమశాతం మొదలు.. అనేక రకాల ఇతర కారణాలు చూపిస్తు రైతులకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి మారలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో నాదెండ్ల మనోహర్ స్పందించారు.
అవును... ఏపీలో వరి పండించే రైతు పరిస్థితి ఏమీ మారలేదని.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్న వేళ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఓ గ్రాఫ్ ని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఎవరు అండగా నిలబడ్డారో ఒకసారి చూడాలంటూ ఆ పోస్టులో మంత్రి మనోహర్ సూచించారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనలో ఈ సమయానికి కేవలం 8.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. కూటమి ప్రభుత్వంలో 15.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మనోహర్ తెలిపారు. ఇదే సమయంలో... 48 గంటల్లోపే డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా పోస్ట్ కు జతచేసిన గ్రాఫ్ ఇమేజ్ లో... వీక్-1, వీక్-2 అంటూ 8 వారాల వివరాలను వెళ్లడించారు మనోహర్. అయితే... ఈ మొదటి వారం, రెండో వారం అనేవి ఈ ఏడాది ప్రారంభంలోనివా.. లేక, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటివా అనేదానిపై కాస్త సందేహాలున్నాయని నెటిజన్లు స్పందిస్తున్నారు. దీనిపై మరింత స్పష్టత ఇస్తే బాగుంటుందని అంటున్నారు.