Begin typing your search above and press return to search.

ఉచిత గ్యాస్ సిలిండర్లు...కూటమి స్పష్టత ఇచ్చినట్లేనా ?

వంట గ్యాస్ ధర నానాటికీ పెరిగిపోతున్న నేపధ్యంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నది పేదలకు భారీ ఊరట అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   25 July 2024 3:54 AM GMT
ఉచిత గ్యాస్ సిలిండర్లు...కూటమి  స్పష్టత ఇచ్చినట్లేనా ?
X

ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు వంతున ప్రతీ పేద కుటుంబానికి అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మరీ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి రావడానికి ఈ హామీ కూడా అత్యంత కీలకంగా పనిచేసింది అని చెప్పాలి. వంట గ్యాస్ ధర నానాటికీ పెరిగిపోతున్న నేపధ్యంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నది పేదలకు భారీ ఊరట అని చెప్పాలి.

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యాభై రోజులకు దగ్గర పడుతోంది. ఈ హామీని ఎపుడు నెరవేరుస్తారు అని విపక్ష వైసీపీ అడుగుతోంది. ప్రజలకు తమ హామీలు ఎంత త్వరగా నెరవేరితే బాగుంటుంది అని ఉంటుంది. అయితే అధికారంలోకి రావడంతోనే ఖజానా ఖాళీ అయిందని కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు కోలుకోవడానికి సమయం పడుతుందని కూడా అంటున్నారు.

దాంతో ప్రజలు ఎంత వరకూ ఏకీభవిస్తారు అన్నది పక్కన పెడితే విపక్షం దీనిని అస్త్రంగా చేసుకుంటుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలో అసెంబ్లీలో జరిగిన చర్చలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. కూటమిలోని పార్టీలు ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చాయని ఆయన అన్నారు.

ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్న దాని మీద పరిశీలన చేస్తున్నామని నాదెండ్ల చెప్పారు. అంతే కాదు అన్ని విషయాలు కూలకషంగా ఆలోచన చేస్తున్నట్లుగా సభకు వివరించారు. ఈ విషయంలో కార్యాచరణ రూపొందిస్తామని కచ్చితంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను పేదింటి మహిళా కుటుంబాలకు అందిస్తామని మంత్రి నాదెండ్ల ఒక స్పష్టత ఇచ్చారు.

అయితే దానికి ఎంత సమయం పడుతుంది, ఎపుడు ఇస్తారు అన్నది మాత్రం చెప్పలేదు ఇస్తామని మాత్రం చెప్పారు. హామీని నెరవేరుస్తామని అన్నారు. కొత్తగా ప్రభుత్వం అధికారం చేపట్టింది కాబట్టి కొంత గడువు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దనతో నాదెండ్ల ఇచ్చిన స్పష్టతతో ప్రస్తుతానికి మహిళా లోకంలో ఆందోళన తగ్గినట్లే అని అంటున్నారు.