మహిళా జర్నలిస్ట్ ప్రశ్న... బట్టలు విప్పిన నాగ సాధువు... వీడియో!
ఈ సమయలో ఓ నాగసాధువుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సదరు సాధువు షాకింగ్ రిప్లై ఇచ్చాడు!
By: Tupaki Desk | 20 Jan 2025 1:30 AM GMTప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభ మేళా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. మరోపక్క నాగ సాధువులు, అఘోరాలు, సన్యాసులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.
అవును.. మహాకుంభ మేళా అత్యంత భారీ ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కుంభమేళాలకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులలో ప్రధానంగా అఘోరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని అంటున్నారు. ఈ సమయలో ఓ నాగసాధువుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సదరు సాధువు షాకింగ్ రిప్లై ఇచ్చాడు!
వివరాళ్లోకి వెళ్తే... మహాకుంభ మేళ జరుగుతున్న సమయంలో అక్కడ అత్యంత అరుదుగా కనిపించే నాగ సాధువుల గురించి తెలుసుకునేందుకు వారి వద్దకు వెళ్లి పలు ప్రశ్నలు సంధిస్తుంటారు జర్నలిస్టులు. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న మహాకుంభ మేళాలో ఓ నాగసాధువును ప్రశ్నించడం మొదలుపెట్టారు ఓ మహిళా జర్నలిస్టు.
ఇందులో భాగంగా... మిగతా సాధువులు బట్టలు వేసుకోరు కదా..?.. మీరు వేసుకున్నారు..? అని సదరు మహిళా జర్నలిస్టు ఆ నాగ సాధువును అడిగారు. దీంతో.. ఆ ప్రశ్న పూర్తయ్యేలోపు నాగసాధువు ఒక్కసారిగా మొలకు కట్టుకున్న బట్టను విప్పేశాడు. ఈ సమయంలో సదరు మహిళా జర్నలిస్టు అతడికి దూరంగా వెళ్తుంది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే... ఇది పాత వీడియో అని.. తాజాగా జరుగుతున్న మహాకుంభ మేళాలోనిది కాదని.. గతంలో నిర్వహించిన అర్ధ కుంభ మేళాకు సంబంధించిందని చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో.. ఈ వీడియో మరోసారి తరపైకి వచ్చి హల్ చల్ చేస్తుందని అంటున్నారు.