రాజ్యసభకు నాగబాబు ఇపుడు కాదుట...లెక్కలు మారాయి !
దాంతో అనూహ్యంగా క్రిష్ణయ్య రేసులోకి దూసుకుని వచ్చారు అని అంటున్నారు. అలా బీజేపీ ఏపీ కోటాలో తన సీటుని దక్కించుకుంటుందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 1 Dec 2024 11:23 AM GMTఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల అయి రోజులు గడుస్తున్నాయి. మూడు స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది. దీని మీద ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి తీవ్ర కసరత్తు చేస్తోంది. నిజానికి మూడు ఎంపీ సీట్లు అంటే అందులో జనసేనకు ఒకటి దక్కుతుందని అలా మెగా బ్రదర్, జనసేన కీలక నేత నాగబాబుకు కచ్చితంగా రాజ్యసభకు వెళ్లే చాన్స్ ఖాయమని అంతా అనుకున్నారు.
నిజానికి ఇది చాలా వరకూ కరెక్ట్ అయ్యేదే కానీ లేటెస్ట్ గా వచ్చిన కొన్ని లెక్కలు మారిన సమీకరణల నేపథ్యంలో అంతా తారు మారు అయింది అని అంటున్నారు. వైసీపీకి చెందిన ఆర్ క్రిష్ణయ్య తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం వెనక కూడా ఒక లెక్క ఉందని అంటున్నారు. ఆయన ఈసారి బీజేపీ కోటా నుంచి ఢిల్లీలో పార్లమెంట్ లో అడుగుపెట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన రాజీనామా కంటే ముందే బేజేపీ నేతలతో ఆ విధంగా అంగీకారం పొందారని అంటున్నారు.
దాంతో అనూహ్యంగా క్రిష్ణయ్య రేసులోకి దూసుకుని వచ్చారు అని అంటున్నారు. అలా బీజేపీ ఏపీ కోటాలో తన సీటుని దక్కించుకుంటుందని తెలుస్తోంది. ఇక మిగిలిన రెండు సీట్లలో బీద మస్తాన్ రావు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. మధ్యలో ఆయన వైసీపీలోకి వెళ్ళి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆ పార్టీకి సీటుకు రాజీనామా చేస్తూనే టీడీపీ పెద్దలు తిరిగి తనను ఎంపీగా పంపించాలని మాట్లాడుకున్నారని అంటున్నారు.
టీడీపీలో ఉన్నపుడు కూడా బీద రాజ్యసభకు వెళ్లాలని ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు. ఆయనకు వైసీపీ ద్వారా ఆ చాన్స్ దక్కింది. దానిని ఇపుడు టీడీపీ నుంచి రెన్యూవల్ చేయించుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. మూడవ సీటు అయితే మోపిదేవి వెంకటర రమణ రాజీనామా చేసినా ఆయన ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు కాబట్టి ఈ సీటు ఒక్కటే ఇపుడు కొత్త వారి కోసం మిగిలింది అని అంటున్నారు.
పైగా ఈ మూడు సీట్లూ బీసీలకు చెందినవి కావడంతో ఆ ప్లేస్ లోకి వేరే వారిని తీసుకుని వస్తే రాజకీయంగా కూడా సమీకరణలలో తేడా వస్తుంది ఇబ్బంది అవుతుందని కూడా భావిస్తున్నారు. దాంతో మోపిదేవి సీటు విషయంలోనే ఎవరా అభ్యర్ధి అన్న చర్చ తప్ప మిగిలిన రెండు కూడా బీద మస్తాన్ రావు, ఆర్ క్రిష్ణయ్య ఖాయమని అంటున్నారు.
ఈ క్రమంలో జనసేనకు సీటు అన్నది ఇవ్వలేకపోతున్నారు అని అంటున్నారు. పైగా బీజేపీ ఎంట్రీతో సీన్ మారిందని తెలుస్తోంది. మరో వైపు చూస్తే నాగబాబు కూడా ఇటీవల చేసిన ఒక ట్వీట్ లో నిస్వార్ధంగా పనిచేసే తమ నాయకుడు పవన్ అని చెబుతూ ఆయన నాయకత్వంలో పనిచేస్తాను అని చెప్పారు. అంతే తప్ప ఆయన ఎక్కడా వేరే అంశాలు ప్రస్తావించలేదు, దాంతో నాగబాబు ఈ మేరకు ఒక క్లారిటీ ఇచ్చేశారు అని ప్రచారం సాగుతోంది.
ఇక ఈ మిగిలిన సీటు చూస్తే కనుక దీని కోసం కూడా చాలా గట్టి పోటీ ఉందని అంటున్నారు. దానికి మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు, కంభంపాటి రామ్మోహనరావు, భాష్యం రామక్రిష్ణ, వర్రా రాయమ్మ, సానా సతీష్ పేర్లు వినిపిస్తున్నాయని అంటున్నారు. దాంతో వీరిలో ఒకరికి ఈ సీటు ఖాయమని అంటున్నారు.
టీడీపీకి ఈ లెక్కన రెండు సీట్లు దక్కుతాయని అందులో ఒకటి బీసీ అయిన బీదకు ఇస్తే మరొకటి ఓసీ నుంచి ఎంపిక చేస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి చూస్తే ఏపీ నుంచి లేటెస్ట్ గా ఖాళీ అయ్యే మూడు సీట్లలో రెండు టీడీపీకి ఒకటి బీజేపీకి ఇస్తారని అంటున్నారు. మరో వైపు చూస్తే 2026లో నాలుగు సీట్లు ఖాళీ అవుతాయి. అపుడు కచ్చితంగా జనసేనకు సీటు ఇస్తారని అలా నాగబాబుకు కచ్చితంగా అవకాశం ఉంటుందని అంటున్నారు.